దర్శకధీరుడికి దక్కాల్సిన గౌరవమే ఇది... ఆస్కారే అక్కున చేర్చుకుందిగా!

Suma Kallamadi
తెలుగు చిత్ర పరిశ్రమ దర్శక ధీరుడు రాజమౌళి గురించి పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగు చిత్ర స్థాయిని ప్రపంచ స్థాయికి చేర్చిన ఘనత వారిది. బాహుబలి, rrr సినిమాలు ప్రపంచం నలుమూలల పేరు ప్రఖ్యాతల్ని తెచ్చి పెట్టాయి. దీంతో తెలుగు సినిమా ఉనికిని ప్రపంచం గుర్తించింది. rrr సినిమా ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ అవార్డును గెలుచుకోవడంతో ఆస్కార్ అవార్డు (పాటకి గాను) పొందిన మొదటి భారతీయ సినిమాగా rrr పేరుని గడించింది. ఈ సినిమా తర్వాత టాలీవుడ్ హీరోలు రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్ లకు ఆస్కార్ అకాడమీ కొత్త సభ్యులుగా ఆహ్వానం అందించిన సంగతి అందరికీ తెలిసిన కథే.
ఈ నేపథ్యంలోనే తాజాగా రాజమౌళి, ఆయన సతీమణి రమా రాజమౌళిలకు కూడా అకాడమీ ఆహ్వానాన్ని పంపింది. దీంతో ఈ సందర్భం రాజమౌళికి తన జీవితంలోనే పెద్ద ప్రైడ్ మూమెంట్ గా నిలవబోతోంది. తాజాగా 487 మంది కొత్త సభ్యుల జాబితాను మోషన్ పిక్చర్స్ అండ్ సైన్స్ కేటగిరిలో సిద్ధం చేసినట్టుగా సమాచారం. వీరిలో రాజమౌళి, రమా రాజమౌళిల పేర్లను చేర్చడం జరిగింది. ఈ నేపథ్యంలో అకాడమీ వారు వీరిద్దరికీ ఆహ్వానం పలికింది. దాంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.
ఇకపోతే ఈ వేడుకకి SS రాజమౌళి, రమా రాజమౌళితో పాటు.. ఇతర ప్రముఖ భారతీయ నటులు కూడా ఆహ్వానించబడ్డారు. వారి లిస్టు ఒకసారి పరిశీలిస్తే... షబానా అజ్మీ, రవి వర్మన్, రితేష్ సిధ్వాని, రీమా దాస్, శీతల్ శర్మ, నిషా పహుజా, ఆనంద్ కుమార్ టక్కర్, హేమల్ త్రివేది, గితేష్ పాండ్యాలు ఉన్నారు. ఇక గత సంవత్సరం లిస్టు చూస్తే... రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, చంద్రబోస్, ఎంఎం కీరవాణి, కెకె సెంథిల్ కుమార్, సాబు సిరిల్ వంటి ప్రముఖ టాలీవుడ్ వ్యక్తులు కూడా అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (AMPAS)లోకి ప్రవేశించడం జరిగింది. ఇక ఈ విషయంపైన జక్కన్న తన కృతజ్ఞతల్ని ఆస్కార్ అకాడమీకి తెలియజేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: