ఏపీ: కూటమిలోని ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇస్తున్న పవన్.. ఏం జరిగిందంటే..?

Divya
జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. తాజాగా ఘనంగా నిర్వహించే సభలలో అధికారులను ఎలా ఉండాలి అధికారులతో ఎలా మాట్లాడాలి.. మంత్రులు ఎలా ఉండాలి అనే విషయం పైన కూడా తాజాగా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఎమ్మెల్యేలకు కూడా పలు సూచనలు ఇవ్వడం జరిగింది పవన్ కళ్యాణ్. శాసనసభలలో ప్రజల ఆశలను ఆకాంక్షలను మాత్రమే అమలు చేసేలా ఉండాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. సభ సాంప్రదాయాలను అందరూ గౌరవించాలంటూ కూడా తెలియజేయడం జరిగింది.


ప్రజా సమస్యలను అధ్యయనం చేసే విధంగా మంత్రులు దిశా నిర్దేశం పాటిస్తూ ఉండాలంటూ తెలియజేశారు. మహిళల రక్షణ విషయంలో ఎవరు ఎలాంటి తప్పులు చేసిన ఏ పార్టీ ఎమ్మెల్యేలు తప్పు చేసిన కచ్చితంగా శిక్ష ఉంటుందని అలాగే గంజాయి, మాదకద్రవ్యాలను ఎవరు ప్రేరేపించినా కూడా కచ్చితంగా ఇబ్బందులు తప్ప వంతు అందరి నేతలను హెచ్చరించారు. నియోజవర్గాల పర్యటనకు సైతం ప్రణాళికను రూపొందిస్తున్నామంటూ పవన్ కళ్యాణ్ తెలియజేశారు. ప్రజలు నమ్మి ఎన్నో ఆశలతో మనకి భారీ మెజారిటీతో గెలిపించారని అలాంటి మనం ప్రజల పైన ఎలాంటి ఇబ్బందులు చేయకూడదని తెలిపారు.

మర్యాదపూర్వకంగా ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉండాలని ముఖ్యంగా భాష సరళంగా మర్యాదపూర్వకంగానే ఉండేలా ఉండాలని ప్రజలు అధికారులు ఉద్యోగులతో మాట్లాడేటప్పుడు ఎలాంటి పురుష పదజాలం పదాలను వాడకూడదు అంటూ తెలిపారు. నియోజవర్గాలలో తమ పార్టీ గురించి గెలిచిన ఎంపీలు ఎమ్మెల్యేలు అభినందన కార్యక్రమం కూడా త్వరలోనే చేపడుతామంటూ తెలిపారు. మీ గెలుపు కోసం తోడ్పడిన కూటమి నాయకులను మన పార్టీ నాయకులను సైతం అభినందించడానికి త్వరలోనే అందరిని క్షేత్రస్థాయిలో కలుస్తానని పవన్ కళ్యాణ్ తెలియజేశారు. వీర మహిళలను సభలు కార్యక్రమాలలో వాలంటరీలుగా పనిచేసే వారిని గుర్తించండి అంటూ పవన్ కళ్యాణ్ తెలియజేశారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ ప్రజలను ఇబ్బంది పెట్టి పనులు ఎవరు చేయకూడదు అంటూ కూటమి నేతలకు ఇన్డైరెక్టుగా వార్నింగ్ ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: