మాచ‌ర్ల పిన్మెల్లి బ్ర‌ద‌ర్స్‌ ఫ్యూచ‌ర్‌... చుక్క‌లు రోజు క‌న‌ప‌డేలా ప్లాన్ చేశారా..!

RAMAKRISHNA S.S.
మాచ‌ర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డిని.. ఈవీఎం ధ్వంసం ఘ‌ట‌న‌లు, హ‌త్యా య‌త్నాల ఘ‌ట‌న లు వెంటాడుతున్నాయి. మే 13న జ‌రిగిన పోలింగ్ స‌మ‌యంలో ఈవీఎం, వీవీప్యాట్ల‌ను ధ్వంసం చేసిన విష‌యం తెలిసిందే.  ఈ స‌మ‌యంలో ఎమ్మెల్యేను నిల‌దీసిన‌.. టీడీపీ ఏజెంట్ నంబూరి శేష‌గిరిరావుపై హ‌త్యా య‌త్నం జ‌రిగింది. స‌ర్కిల్ ఇన్ స్పెక్ట‌ర్‌పైనా హ‌త్యాయ‌త్నం జ‌రిగింది. ఈ మూడు ఘ‌ట‌న‌ల్లోనూ ఏ1గా పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి ఉన్నారు.

దీంతో ఆయ‌న ప‌రారు కావ‌డం.. పోలీసులు ఆయ‌న కోసం వెత‌క‌డం.. కానీ, ఆయ‌న మాత్రం ప‌ట్టుబ‌డ‌క పోవ‌డం ఇదంతా పెద్ద సినీ డ్రామాను త‌ల‌పించింది. ఎట్ట‌కేల‌కు హైకోర్టు నుంచి ముంద‌స్తు బెయిల్  వ‌చ్చే వ‌రకు కూడా.. పిన్నెల్లి ఎక్క‌డ ఉన్నార‌నేది మాత్రం ఎవ‌రూ గుర్తించ‌లేక పోయారు. క‌ట్ చేస్తే.. ముంద‌స్తు బెయిల్ వ‌చ్చిన త‌ర్వాత‌.. ఆయ‌న ఎస్పీ కార్యాల‌యానికి రావ‌డం తెలిసిందే. అక్క‌డ రోజూ వ‌చ్చి సంత‌కం చేసి వెళ్లాల‌ని ఆదేశించ‌డంతో పిన్నెల్లి రోజూ వ‌స్తున్నారు.

ఇదిలావుంటే.. ఈ కేసు ఇక్క‌డితో ముగిసి పోలేదు. తాజాగా పిన్నెల్లి సోద‌రుల‌పై పోలీసులు రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ప్ర‌తిపాద‌న‌కు చంద్ర‌బాబు నుంచి గ్రీన్ సిగ్న‌ల్ కూడా వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. ఇక‌, టీడీపీ ఏజెంట్ నంబూరి శేష‌గిరిరావు... సుప్రీం కోర్టును ఆశ్ర‌యించిన విష‌యం తెలిసిందే.  పిన్నెల్లి నుంచి తనకు ప్రాణహాని ఉందని సుప్రీం కోర్టులో శేషగిరిరావు పిటిషన్ వేశారు. పిన్నెల్లికి హైకోర్టు ఇచ్చిన అరెస్టు మినహాయింపు ఆదేశాలు రద్దుచేయాలని కోరారు.

ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో తనపై దాడి చేశారని పేర్కొన్నారు.   కౌంటింగ్ రోజు కూడా హింసకు పాల్పడే ప్రమాదం ఉందని వివ‌రించారు.  ఈ కేసుల్లో ఆధారాలున్నా ఎమ్మెల్యే పేరు, అనుచరుల పేర్లు లేకుండా కేసు పెట్టారని పేర్కొన్నారు.  గుర్తు తెలియని  వ్యక్తులంటూ ఎమ్మెల్యేకు అనుకూలంగా కొంద‌రు పోలీసులు వ్యవహరించారని పేర్కొన్నారు.  తీవ్ర ఘటనలు చోటు చేసుకున్నా.. ముంద‌స్తు బెయిల్ మంజూరు చేయ‌డం ఆందోళన కలిగిస్తోందన్నారు.  

ఈ కేసు విచార‌ణ ఇంకా కొన‌సాగుతోంది. మ‌రోవైపు పోలీసులు ఇంకా తుది విచార‌ణ చేస్తున్నారు. ఇటు రౌడీ షీట్లు కూడా పెడుతున్నారు. అంటే ఒక‌ర‌కంగా పిన్నెల్లిని అష్ట‌దిగ్భంధం చేస్తున్నారు. ఆదుకునేం దుకు పార్టీ కూడా బ‌లంగా లేక‌పోవ‌డం.. నాయ‌కులు సైతం ముందుకు రాక‌పోవ‌డంతో పిన్నెల్లి ప‌రిస్థితి అడ‌క‌త్తెర‌లో న‌లిగిపోతోంది. వ‌చ్చేఐదేళ్లు ఆయ‌న కోర్టు కేసులు.. విచార‌ణ‌ల‌తోనే గ‌డపాల్సి ఉంటుంద‌ని అంటున్నారు. ఇక్క‌డ చిత్రం ఏంటంటే.. మాచ‌ర్ల వెళ్ల‌డానికి వీల్లేద‌న్న ఉత్త‌ర్వులు ఇంకా కొన‌సాగుతున్నాయి. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: