టీడీపీలో వాళ్లు ఫుల్ హ్యాపీ... బాబుకే పెద్ద ప‌రీక్ష పెట్టారుగా...!

RAMAKRISHNA S.S.
రాష్ట్రంలో ఇటీవ‌ల జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీడీపీ విజ‌య దుందుభి మోగించింది. క‌నీ వినీ ఎరుగ‌ని రీతిలో విజ‌యం సాధించింది. కూట‌మిగా వెళ్లినా.. 144 సీట్ల‌కే ప‌రిమిత‌మై పోటీ చేసినా, 134 స్థానాల్లో పార్టీ విజ‌యం ద‌క్కించుకుంది. అంటే.. 92 శాతం మందిని చంద్ర‌బాబు గెలిపించుకున్నారు. ఇప్పుడు ఒక‌ర‌కంగా కూట‌మిలో విభేదాలు వ‌చ్చినా.. పార్టీ అధికారం మాత్రం చెక్కుచెద‌ర‌దు. అయితే.. పార్టీ ఇంత‌గా గెలుపు గుర్రం ఎక్క‌డానికి చంద్ర‌బాబు ప్ర‌చారం మాత్ర‌మే కాదు.. కార్య‌క‌ర్త‌ల కృషి కూడా.

ఇక‌, కార్య‌క‌ర్త‌ల‌ను న‌డిపించిన నాయ‌కుల కృషిని కూడా గుర్తించాల్సిన త‌రుణం. ఇక్క‌డ‌కు వ‌చ్చే స‌రికే చంద్ర‌బాబుకు ఇబ్బందులు ఎదురు కానున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు మంత్రులుగా తీసుకున్న స్థాయిలోనే కొన్ని ఇక్క‌ట్లు ఆయ‌న‌కు ఎదుర‌య్యాయి. ఇక‌, ఇప్పుడు పార్టీని విజ‌య‌ప‌థంలో ముందుకు న‌డిపించిన నాయ‌కుల‌ను సంతృప్తి ప‌ర‌చ‌డం మ‌రింత ఇబ్బందిగానే ఉంటుంది. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు ప‌రీక్ష ఎదురు కానుంద‌నే వాద‌న వినిపిస్తోంది.

ప్ర‌స్తుతం రాష్ట్రంలోని 56 కార్పొరేష‌న్ల‌కు చైర్మ‌న్లు, వైస్ చైర్మ‌న్లు రాజీనామా చేశారు. వీటికి అద‌నంగా.. మ‌రో నాలుగు సామాజి క వ‌ర్గాల‌కు.. కార్పొరేష‌న్ల‌ను ఏర్పాటు చేయ‌నున్నారు. దీంతో సుమారు 60 మంది నాయ కుల‌కు నామినేటెడ్‌ప‌ద‌వులు ద‌క్కించుకునే అవ‌కాశం ఏర్ప‌డింది. ఇవికాకుండా.. ప్ర‌ముఖ దేవాల‌యా ల‌కు బోర్డులు ఉన్నాయి.వాటికి కూడా చైర్మ‌న్ల‌ను ఎంపిక చేసుకునే అవ‌కాశం ఏర్ప‌డింది. ఇంత వ‌ర‌కు నాయ‌కుల‌కు అవ‌కాశం ఇచ్చే ఛాన్స్ క‌నిపిస్తోంది.

కానీ, నాయ‌కుల సంఖ్య‌ను చూస్తే.. వేలల్లో ఉంది. క‌నీసం ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న అంచ‌నా ల‌ప్ర‌కారం 1200 మంది కీల‌క నాయ‌కులు తేలుతున్నారు. వీరంతా పార్టీని ముందుకు న‌డిపించ‌డంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. ఒక్క విజ‌య‌వాడ‌లోనే ఎనిమిది మంది ఉన్నారు. వీరిని ఎంత ఫిల్ట‌ర్ చేసినా.. ఐదుగురు తేలుతున్నారు. ఇక‌, రాజ‌మండ్రి, విశాఖ‌, అనంత‌పురం, క‌ర్నూలు ఇలా.. జిల్లాల వారీగా లెక్కించినా.. వేల‌ల్లో ఉన్నారు. మ‌రి వీరంద‌రినీ .. ఏమేర‌కు సంతృప్తి ప‌రుస్తానేది ఇప్పుడు మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: