జగన్ ఇంటి కూల్చివేత..రంగంలోకి దిగిన లేడీ బాస్ ?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి వరుసగా షాక్ లు తగులుతున్నాయి. ఏపీలో దారుణంగా ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డికి తెలంగాణలో..  రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది.హైదరాబాద్లోని లోటస్ పాండ్ దగ్గర జగన్మోహన్ రెడ్డి ఇల్లు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఇంటి ముందు ఉన్న...  సెక్యూరిటీ గదులను కూల్చేసింది జిహెచ్ఎంసి. అసలు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా... దౌర్జన్యంగా వచ్చి జిహెచ్ఎంసి అధికారులు... జగన్ ఇంటి ముందు ఉన్న గదులను.. నేలమట్టం చేశారు.

 
 ఈ సంఘటనకు సంబంధించిన వార్త రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది. అయితే ఈ సంఘటన గురించి సీఎం రేవంత్ రెడ్డికి ఎలాంటి సమాచారం లేదట. కేవలం దక్షిణ తెలంగాణకు చెందిన ఓ మంత్రి.... ఆదేశాల మేరకు జిహెచ్ఎంసి అధికారులు... ఈ పని చేశారట. చంద్రబాబు నాయుడు సలహా మేరకు... తెలంగాణ మంత్రి ఈ ఆదేశాలు ఇచ్చారట. అయితే మంత్రి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో...  రంగంలోకి దిగిన పోలీసులు అటు జిహెచ్ఎంసి అధికారులు... గదులను నేలమట్టం చేశారు.

 
అయితే... ఈ సంఘటనపై... రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా సీరియస్ అయింది. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు... రంగంలోకి దిగిన అమ్రాపాలి అధికారులపై వేటు వేసింది. ఖైరతాబాద్ జోనల్ కమిషనర్, ఐఏఎస్ అధికారి హేమంత్ బోర్కడే అనే అధికారిపై బదిలీ వేటు వేశారు. జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు అక్రమ నిర్మాణాల కూల్చివేత పై సీరియస్ అయినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం.... ఉన్నతాధికారులకు... సమాచారం లేకుండా ఇలా చేయడం పై మండిపడిందట.

 
ఓ మంత్రి ఆదేశాల మేరకు గ్రేటర్ హైదరాబాద్ అధికారులు కూల్చివేతలు... చేయడమేంటని... హేమంత్ పై  ఆగ్రహించిందట. అంతేకాదు ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్ ను... జి ఐ డి కి రిపోర్ట్ చేయాలని కూడా... ఐఏఎస్ ఆమ్రపాలి... స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారట. ఇలాంటి సంఘటనలు మరోసారి జరగకుండా చూస్తామని... ఆమ్రపాల్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: