జగన్ ను ఎదురించిన రియల్‌ హీరోకు..మంత్రి పదవి రాకుండా వాళ్లే అడ్డుకున్నారా?

Veldandi Saikiran

* వైసీపీ ఫ్యాన్ గాలిలోనూ నిలిచిన హీరో
* ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితుడు
* గతంలో పౌరసరఫరాల శాఖ మంత్రిగా అనుభవం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన నేపథ్యంలో.. మంత్రి పదవి రాని వారు కాస్త డీలా పడినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులకు మంత్రి పదవి ఇవ్వకుండా యంగ్ జనరేషన్ కు మాత్రమే చంద్రబాబు... మంత్రి పదవులు ఇచ్చారు.  అయితే పార్టీ భవిష్యత్తును ఉద్దేశించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. టిడిపి పార్టీలో ఎన్టీఆర్ హయాం నుంచి ఉన్న గోరంట్ల బుచ్చయ్యకు మరోసారి మొండి చేయి చూపించారు చంద్రబాబు.

టిడిపి ఎమ్మెల్యేగా ఏడుసార్లు విజయం సాధించారు గోరంట్ల బుచ్చయ్య. అంతేకాకుండా...  2019 ఎన్నికల్లో కూడా గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. విజయం సాధించి చరిత్ర సృష్టించారు. ఎన్టీఆర్ హయాంలో... అంటే 1994 సంవత్సరంలో పౌరసరఫరాల శాఖ మంత్రిగా గోరంట్ల బుచ్చయ్య పని చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యేగా గెలిచినా కూడా... ఆయనకు మంత్రి పదవి రాలేదు. ఒకసారి మంత్రిగా పనిచేసే రిటైర్ అయిపోవాలని... గోరంట్ల బుచ్చయ్య ఎంతో ఆత్రుతగా చూస్తున్నారు.

2024 ఎన్నికల్లో టిడిపి పార్టీ అఖండ విజయం సాధించిన కూడా... గోరంట్ల బుచ్చయ్యకు పదవి రాలేదు. దీనికి ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి. గోరంట్ల బుచ్చయ్యది కమ్మ సామాజిక వర్గం. ఇదే ఇప్పుడు ఆయనకు విలన్ గా మారింది. కమ్మ సామాజిక వర్గానికి చెందిన దాదాపు 35 మంది... ఈసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇదే సామాజిక వర్గానికి  చెందిన చంద్రబాబు ముఖ్యమంత్రి కాగా, నారా లోకేష్ మంత్రి పదవి దక్కించుకున్నారు. వాళ్ళిద్దరికీ కచ్చితంగా ఆ పదవులు రావాల్సిందే.

ఇక జనసేన కోటాలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాదెండ్ల మనోహర్ మంత్రి పదవి దక్కించుకున్నారు. ఆయనను కూడా తప్పించలేరు. పయ్యావుల కేశవ్, గొట్టిపాటి రవి ఇద్దరూ జూనియర్లు... భవిష్యత్తులో పార్టీకి వారి అవసరం ఉంది. అందుకే వారికి మంత్రి పదవులు ఇచ్చారు చంద్రబాబు. అయితే గోరంట్ల బుచ్చయ్య చౌదరి... ఏజుడు పర్సన్. అందుకే ఆయనకు... మంత్రి పదవి ఇవ్వకుండా... ఏదైనా కార్పొరేషన్ పదవి ఇస్తారని తెలుస్తోంది. లేకపోతే ప్రభుత్వ విప్ ఇచ్చే ఛాన్స్ ఉందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: