పూర్తి అనుభవంతో చంద్రబాబు ఈసారి ఓట్లు రాబట్టారా..?

Suma Kallamadi
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఒక కోటి 65 లక్షల కుటుంబాలు ఉన్నాయి. అయితే ఒక కోటి 45 లక్షల కుటుంబాలకు జగన్ ప్రభుత్వం ద్వారా ఆర్థిక సహాయం లభించింది. జగన్ సర్కార్ ప్రతి ఏడాది ఒక కోటి 45 లక్షల మంది కుటుంబాల బ్యాంకు ఖాతాలో 10 వేల నుంచి 50 వేల డబ్బును జమ చేశారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రభుత్వం నుంచి రూ.2.5 లక్షల దాక డబ్బులను పొందిన ప్రజలు కోటిన్నర మంది దాకా ఉన్నారు. ఇక మొత్తం మీద డబ్బులను పొందిన వారు 2.60 కోట్ల నుంచి 2.80 కోట్ల మంది దాక ఉన్నారు. అయితే వీరిలో కనీసం రెండు కోట్ల మంది తమకు ఓటు వేసిన భారీ మెజారిటీతో గెలవచ్చని జగన్ నమ్మకంగా ఉన్నారు.
 అయితే జగన్ ఈ ధీమాతో ఉంటే చంద్రబాబు మాత్రం వేరే లెక్కలు వేసుకొని తానే గెలుస్తాననే విశ్వాసంతో ఉన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఉద్యోగుల ఓట్లన్నీ తమకే పడతాయని అనుకుంటున్నారు. కొత్తగా బిజెపిని చేర్చుకోవడం వల్ల ఆ ఓట్లు కూడా తనవే అని భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పోలైన జనసేన ఓట్లు సైతం తనకే పడటం వల్ల ప్లస్ అవుతుందని అనుకుంటున్నారు. అలానే 80 లక్షల మంది టీడీపీకి కళ్ళు మూసుకొని ఓట్లు వేసి ఉంటారనేది చంద్రబాబు విశ్వాసం. వాళ్లలో కమ్మ సామాజిక వర్గ ప్రజలు, అలానే కాపు సామాజిక వర్గ ప్రజలు కూడా ఉండవచ్చని అనుకుంటున్నారు. మాదిగ సామాజిక వర్గ ప్రజలను కూడా తమ వైపు తిప్పుకున్నట్లు ఆయన నమ్మారు. వీటన్నిటినీ కలుపుకుంటే వైసీపీకి 45 % కంటే తక్కువ ఓట్లు వస్తే, తమకు 52 శాతం ఓట్లు పడతాయని నమ్ముతున్నారు.
 కోటి 60 లక్షల నుంచి కోటి 80 లక్షల ఓట్లు టీడీపీ + కూటమికి వచ్చి ఉంటాయని చంద్రబాబు లెక్కలు వేసుకున్నారు. పోయిన ఎన్నికలలో బీజేపీ, కాపు ఓట్లు వైసిపికి పడిపోయాయని కానీ ఈసారి ఆ ప్రజల ఓట్లు తిరిగి తమకే వచ్చేసాయని బాబు విశ్వసిస్తున్నారు. వైసీపీకి చెందిన ఓట్ బ్యాంకులో రెండు శాతం నుంచి మూడు శాతం ఓట్లను షర్మిల చీల్చి ఉండవచ్చు అని అంచనా వేస్తున్నారు. మొత్తం మీద గెలుపు తనదేనని చంద్రబాబు పూర్తి నమ్మకంతో ఉన్నట్టు తెలుస్తోంది. 40 ఏళ్ల అనుభవంతో వ్యూహాత్మక పొత్తులు కుదుర్చుకొని, అన్ని వర్గాల ప్రజలను తమ వైపు తిప్పుకోవడం ద్వారా చంద్రబాబు ఈసారి గెలవబోతున్నారని టిడిపి వాళ్లు కూడా నమ్ముతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: