పిఠాపురంలో పవన్ గెలుస్తారంటారా? పరిస్థితి ఇదే?

Purushottham Vinay
•పిఠాపురంలో ఆసక్తిగా మారిన రాజకీయం 

•పవన్ కి అనుకూలంగా మారిన జనాభిప్రాయం 


పిఠాపురం - ఇండియా హెరాల్డ్: ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ, టీడీపీ తర్వాత అతి పెద్ద పార్టీగా జనసేన అవతరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే గత ఎన్నికల్లో ఒక స్థానంలో గెలిచిన జనసేన ఈసారి డబుల్ డిజిట్ కు చేరుకుంటుందని ఆ పార్టీ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈసారి కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీకి  రెండంకెల సీట్లు రావడంతో పాటు తొలిసారి జనసేనాని పవన్ కల్యాణ్ కూడా శానససభలోకి కాలుమోపుతారని ఆయన ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.గత 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్ చాలా దారుణంగా ఓడిపోయారు. జనసేన తరపున కేవలం రాజోలు నుంచి మాత్రమే ఒకే ఒక్కరు గెలిచారు. అయితే ఈసారి కూటమిగా మరోసారి పోటీకి దిగడంతో జనసేన పార్టీ ఈసారి ఎన్నికలలో అసెంబ్లీలోకి ఠీవిగా అడుగుపెడుతుందన్న కామెంట్స్ సోషల్ మీడియాలో ఆయన ఫ్యాన్స్ నుంచి వినిపిస్తున్నాయి.ఈ ఎన్నికల్లో జనసేన 21 అసెంబ్లీ స్థానాల్లోనూ, రెండు పార్లమెంటు స్థానాల్లో బరిలోకి దిగింది. అయితే ఈసారి డబుల్ డిజిట్ రావచ్చన్న అంచనాలు ఆ పార్టీ ఫ్యాన్స్ నుంచి వినిపిస్తున్నాయి. పది నుంచి పన్నెండు స్థానాలను కైవసం చేసుకుంటామని జనసేన పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత  తెలిపారు. అంటే సగానికి సగం స్థానాల్లో జనసేన అభ్యర్థులు గెలిచే అవకాశాలున్నాయని సమాచారం తెలుస్తుంది. ఇక ఈసారి పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సీటు హాట్ సీట్ గా మారింది.


ఇక్కడ పవన్ కి పోటీగా వైసీపీ తరపున వంగ గీత కూడా స్ట్రాంగ్ అపోనెంట్ గా ఉంది. ఇద్దరిలో ఎవరు గెలుస్తారు అనే విషయానికి వస్తే.. ఎన్నో సంవత్సరాల నుంచి పిఠాపురం డెవలప్ కాలేదు. ఎంతోమంది నాయకులు వచ్చినా కూడా పిఠాపురాన్ని అభివృద్ధి చేయలేకపోయారు. కానీ ఈసారి అటు పవన్ నుంచి ఇటు గీత నుంచి వచ్చిన హామీలపై అక్కడ ప్రజల్లో నమ్మకం ఉంది. SC, st మైనారిటీ వర్గాలు వైసీపీకి ఫేవర్ కాబట్టి గీతకి ఓట్లు పడే ఛాన్స్ ఉంది. అలా అని పవన్ కళ్యాణ్ ఓడిపోతారని చెప్పలేము. ఎందుకంటే పవన్ పైన కూడా నమ్మకం ఉంది. కాబట్టి ఈసారి పిఠాపురం జనాలు పవన్ కళ్యాణ్ కి ఛాన్స్ ఇచ్చి గెలిపించే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. పైగా కాపుల నుంచి కూడా పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ ఉంది. అంతేగాక పిఠాపురంలో ప్రజలు ఈసారి కొత్తవారికి ఛాన్స్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని అంటే పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశం ఉన్నట్లు ఇండియా హెరాల్డ్ సర్వేలో తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: