ఏపీ: స్వరం మార్చిన బాబు.. జగన్ వైపే అడుగు ..!

Divya
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు పూర్తి అయిన తర్వాత.. అటు టిడిపి వైసిపి రెండు పార్టీలు కూడా తాము గెలుస్తామని ధీమాతో ఉన్నారు. వాస్తవానికి ఎవరు లెక్కలు వారికి ఉంటాయని కూడా చెప్పవచ్చు.. ఒక్కటి మాత్రం వాస్తవము.. సంక్షేమ పథకాలు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో కీలకంగా మారనున్నాయి.. సంక్షేమ పథకాల కోసమే జనం ఓట్లు వేస్తున్నారా.. ఒకవేళ చంద్రబాబు గెలిస్తే ప్రజలు సంక్షేమ పథకాలకు ఎక్కువ డబ్బు కోసం ఓటు వేశారని చెప్పవచ్చు.. ముఖ్యంగా విద్యావంతులు ఇతరత్రాలను పక్కన పెడితే.. మహిళలు , వృద్ధులు జగన్ ఇచ్చిన దానికంటే చంద్రబాబు ఎక్కువ ఇస్తానంటే నమ్మి ఓటు వేశారా అనే విషయం కూడా తేలాల్సి ఉన్నది.

జగన్ సంక్షేమ పథకాలను తీసుకువస్తే.. ఆ పథకాలను పీక్స్ స్టేజ్ కు తీసుకువెళ్తానని చంద్రబాబు తెలియజేశారు. ఒకవేళ జగన్ ని నమ్మితే సంక్షేమ పథకాలు కావాలి కానీ.. అందుకు లిమిట్ ఉండాలి.. లిమిట్ లెస్ సంక్షేమ పథకాలు వద్దని కోరుకున్నట్లు.. విద్యావంతులు లేకపోతే పార్టీల సానుభూతిపరులైతే.. ప్రధానంగా సంక్షేమ పథకాలే కావాలని కోరుకుంటున్నారు. చంద్రబాబు గెలవాలంటే ఖచ్చితంగా జగన్ ఇచ్చే సంక్షేమ పథకాల కంటె మరింత ఎక్కువ ఇవ్వాలి. చంద్రబాబు కూడా ఈ విషయం పైన ఆలోచించి మేనిఫెస్టోను విడుదల చేశారు.

దీంతో ఎప్పుడు మాట్లాడినా కూడా చంద్రబాబు ఆంధ్రప్రదేశ్  నిన్నటిదాకా శ్రీలంక అవుతుందని చెప్పిన చంద్రబాబు ఏకంగా జగన్ బాట పట్టారు.. దీంతో స్వరం మార్చారు చంద్రబాబు.. మరి పేదలు ఏమనుకుంటున్నారు డబ్బులు విచ్చలవిడిగా కావాలనుకుంటున్నారా..? లేకపోతే లిమిట్ గా కావాలనుకుంటున్నారా  ఈ ప్రశ్నకి సమాధానం వచ్చే నెల నాలుగవ తేదీ తెలియబోతోంది. ముఖ్యంగా చంద్రబాబు ఇస్తానన్నటువంటి పథకాల పైన విశ్వాసం ఉందా.. లేకపోతే జగన్ మీద ఉందా అనే విషయం కూడా తెలియబోతోంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికలు సైతం సంక్షేమ పథకాలే కీలకంగా మారుతున్నాయి. ఏది ఏమైనా చివరికి జగన్ స్థాపించిన సంక్షేమ పథకాలను చంద్రబాబు అడ్డు పెట్టుకున్నారని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: