పవన్: టాలీవుడ్ని షేక్ చేసినట్టు అసెంబ్లీని షేక్ చేస్తాడా?

Purushottham Vinay
•ఆసక్తిరేపుతోన్న పవన్ అసెంబ్లీ ఎంట్రీ

•పవర్ స్టార్ కి పిఠాపురంలో గెలుపు పక్కా అంటున్న ఎగ్జిట్ పోల్స్

పిఠాపురంలో జనసేన అధినేత టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ గెలుపు ఖాయమని పీపుల్‌ పల్స్ ఎగ్జిట్ పోల్‌ సర్వే తెలిపింది. పవన్‌ కల్యాణ్‌ పక్కాగా ఆ స్థానం నుంచి 60 వేల నుంచి 70వేల మెజారిటీతో గెలవబోతున్నట్టు సర్వే పేర్కొంది.ఇంకా అంతేకాదు పవన్ కళ్యాణ్ మొదటి సారి ఎమ్మెల్యేగా ఏపీ అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయమని ఎగ్జిట్ పోల్ సర్వే సంస్థలు చెబుతున్నాయి. అక్కడ శాసనసభలో మొత్తం ఓటర్లు 2.35 లక్షల మంది ఉన్నారు. అక్కడ మొత్తం 86.63 శాతం పోలింగ్ నమోదు అయింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ కు ప్రత్యర్ధిగా వంగా గీత వైపీసీ తరుపున నిలబడి పోటీ చేసింది. అక్కడ వంగా గీతపై పవన్ కళ్యాణ్ దాదాపు 60 వేలకు పైగా మెజారిటీతో గెలవబోతున్నట్టు పీపుల్స్ పల్స్ సంస్థ సర్వేతో పాటు పలు మెజారిటీ సర్వేలు కూడా చెబుతున్నాయి. ఎందుకంటే ఈ నియోజకవర్గంలోని కాపు సామాజికవర్గం ఓట్లు మొత్తం 71 వేలు ఉన్నాయి. అందులో 69 వేల ఓటర్లు పవన్ కళ్యాణ్ కే ఓటు వేసినట్టు తెలిసింది. ఇతర సామాజిక ఓట్లు కూడా పవన్ కళ్యాణ్ కే జై కొట్టినట్టు తెలుస్తుంది.

ఈ ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు చెందిన జనసేన పార్టీ.. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీతో పాటు వైసీపీకి ప్రధాన పక్షం అయిన తెలుగు దేశం పార్టీతో కూటమిగా ఏర్పడి బరిలో దిగింది. అయితే ఈ సారి జనసేన పార్టీ 2 లోక్ సభ సీట్లతో పాటు 20 పైగా సీట్లలో బరిలో దిగింది. ఈ సారి జరిగిన ఎన్నికల్లో దాదాపు 10 పైగా సీట్లలో విజయం సాధించడం ఖాయం అని అనేక సర్వేలు చెబుతున్నాయి. పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం నుంచి అసెంబ్లీకి పోటీ చేసి రెండు చోట్లా కూడా చాలా ఓడిపోయారు. మొత్తంగా గత ఎన్నికల్లో ఎదురైన ఓటమి నుంచి పాఠాలు బాగా నేర్చుకొని.. కూటమి అండతో పవన్ కళ్యాణ్ ఈ సారి ఎన్నికల్లో పోటీ చేసారు. ఇక ఈ ఎన్నికల్లో మెజారిటీ సర్వేలు చెబుతున్నట్టు టీడీపీ కూటమి అధికారంలో వస్తే ఆ క్రెడిట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కే దక్కుతుందని అందరు చెబుతున్నారు.పవన్ కళ్యాణ్ ప్రసంగాలకి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.టాలీవుడ్ని తన స్టార్ డంతో తన సినిమాలతో వసూళ్ల రికార్డులతో షేక్ చేసిన పవర్ స్టార్ ఈసారి పాలిటిక్స్ లో కూడా గెలిచి అసెంబ్లీని షేక్ చేస్తాడో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: