ఆ విషయంలో రూటు మార్చిన చిట్టి.. గ్లామర్ షో చేస్తూ రచ్చ..!

Anilkumar
టాలీవుడ్ యంగ్ బ్యూటీ పొడుగు కాళ్ళ సుందరి ఫరియా అబ్దుల్లా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జాతి రత్నాలు సినిమాతో హీరోయిన్గా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరీక్షమైన ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ల లిస్టులోకి చేరిపోయింది. ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇక ఇందులో ఎంతో అమాయకంగా నటించి ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది.  ఈ సినిమా తరువాత తనకి వరుస సినిమాల్లో నటించే అవకాశాలు వస్తాయని అందరూ భావించారు. కానీ ఊహించని విధంగా ఈమెకి సినిమా

 అవకాశాలు రాలేదు. దాంతో కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించింది. అలాగే కొన్ని కీలక పాత్రల్లో కనిపించినప్పటికీ వాటితో పెద్దగా గుర్తింపును సంపాదించుకోలేకపోయింది. ఆ తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో ఒక చిన్న పాత్ర చేసింది. అలాగే పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో నటిస్తోంది.  బంగారు రాజు సినిమాలో ఒక స్పెషల్ పాటలో నాగార్జున నాగచైతన్యలతో కలిసి స్టెప్పులేసింది ఈ చిన్నది. బంగార్రాజు తర్వాత వరుస సినిమాల్లో హీరోయిన్గా నటించిన ఈమే ఆ తర్వాత టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ నటించిన రావణాసుర సినిమాలో హీరోయిన్ గా నటించింది. కానీ ఈ సినిమా ఊహించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక ఇటీవల

 అల్లరి నరేష్ కి జోడిగా ఆ ఒకటి అడక్కు అనే సినిమాలో నటించిన ఊహించిన విధంగా ఈ సినిమా కూడా స్లాబ్ టాక్ తెచ్చుకుంది. త్వరలోనే ఈ సినిమా ఓటీటీ లోకి కూడా రాబోతోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు ఈ బ్యూటీ ఒక వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో గ్లామర్ షో చేస్తోంది. గ్లామర్ గేట్లు పూర్తిగా ఎత్తేసి అందాల ఆరబోత చేస్తుంది. తాజాగా సోషల్ మీడియాలో తనకి సంబంధించిన పలు హాట్ ఫోటోలను షేర్ చేసింది ఈ బ్యూటీ. దీంతో ప్రస్తుతం ఆ ఫోటోలో సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. బ్లూ కలర్ డ్రెస్ లో హాట్ లుక్స్ తో అందరినీ ఆకట్టుకుంటుంది ఈ బ్యూటీ. దర్శక నిర్మాతలను ఆకట్టుకునేలా తన అందాలను చూపిస్తూ ఫోటోలను షేర్ చేస్తోంది ఈ అమ్మడు. దీంతో తనకి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి ఇంతలా అందాలు చూపిస్తున్న ఈ అమ్మడికి ఇకనైనా మంచి సినిమాల్లో అవకాశాలు వస్తాయా అన్నది చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: