యానిమల్ సక్సెస్.. మరో తెలుగు డైరెక్టర్ తో రణబీర్ కపూర్..!?

Anilkumar
తెలుగు సినిమాలు ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో సత్తా చూపుతున్నాయి. ప్రస్తుతం తెలుగు సినిమాల హవా కొనసాగుతోంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇందులో భాగంగానే ఇప్పుడు తెలుగు సినిమా సత్తా చూసి అటు బాలీవుడ్ భయపడుతుంది అని చెప్పాలి. దానికి తోడు బాలీవుడ్ లో ఉన్న చాలా మంది టాప్ హీరోలు ఇప్పుడు తెలుగు సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.  ఇప్పటికే  రణబీర్ కపూర్ రీసెంట్గా తెలుగు సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. రణబీర్ కపూర్ తెలుగు స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో యానిమల్ సినిమా చేశాడు. ఈ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం

 లేదు. అయితే ఈ సినిమా తర్వాత కూడా మరోసారి ఇప్పుడు రణబీర్ కపూర్ తెలుగు సినిమా దర్శకుల పైనే ఫోకస్ చేస్తున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రణబీర్ కపూర్ ఇప్పుడు మరొక తెలుగు దర్శకుడు తో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లుగా సమాచారం వినబడుతోంది.  ప్రస్తుతం రణబీర్ కపూర్ బాలీవుడ్ లో పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇక ఆ సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ తెలుగు దర్శకుడు తో ఖచ్చితంగా సినిమా చేయాలి అని ప్రాణాలికలు సిద్ధం

 చేస్తున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. అంతేకాదు వాటికి సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నట్లుగా సమాచారం. అయితే ఆ తెలుగు దర్శకుడు ఎవరు.. సినిమా ఏంటి .. ఎప్పుడు తీస్తారు అన్న అనుమానాలు నెలకొన్నాయి. కానీ ఇప్పటివరకు వాటిపై ఎటువంటి క్లారిటీ అయితే లేదు. కానీ ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా కొనసాగుతున్న ఒక డైరెక్టర్ తో సినిమా చేయడానికి రణబీర్ కపూర్ సిద్ధంగా ఉన్నట్లుగా అయితే తెలుస్తోంది. అంతేకాదు స్క్రిప్ట్ కూడా ఫైనల్ అయింది అని.. త్వరలోనే సినిమాని సైతం అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి అని వార్తలు వినబడుతున్నాయి. ఇక యానిమల్ సినిమా సక్సెస్ తో రణబీర్ కపూర్ ఇప్పుడిప్పుడే తెలుగులో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. మరి ఈ ఇంట్రెస్ట్ ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.. రాబోయే రోజుల్లో బాలీవుడ్ ని పూర్తిగా వదిలేసి రణబీర్ టాలీవుడ్ కి వస్తాడా అన్న అనుమానాలు సైతం నెలకొన్నాయి. చూడాలి మరి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: