ఏకంగా అంత మందితో ఫైట్ చేస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్..?

MADDIBOINA AJAY KUMAR
తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న హీరోలలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఒకరు. ఈయన కొంత కాలం క్రితం తెలుగు లో బ్లాక్ బాస్టర్ విజయం సాధించిన ఛత్రపతి మూవీ ని హిందీ లో చత్రపతి అనే టైటిల్ తోనే రీమిక్ చేశాడు. ఈ సినిమాతో ఈ నటుడు హిందీ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇకపోతే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపలేదు. దానితో చత్రపతి రీమేక్ తర్వాత ఈ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  ,దగ్గుపాటి రానా హీరోలుగా రూపొందిన భీమ్లా నాయక్ సినిమాకు దర్శకత్వం వహించి దర్శకుడుగా మంచి గుర్తింపును సంపాదించుకున్న సాగర్ కే చంద్ర దర్శకత్వంలో టైసన్ నాయుడు అనే మూవీ ని మొదలు పెట్టాడు.
 

ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా జరుగుతుంది. ఇకపోతే ఈ మూవీ యొక్క ప్రస్తుత షెడ్యూల్ రాజస్థాన్ లో జరుగుతుంది. రాజస్థాన్ లో ఈ మూవీ బృందం ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ ను షూట్ చేస్తుంది. ఈ చిత్ర యూనిట్ దానికి సంబంధించిన ఫోటోలను నెట్టింట పోస్ట్ చేసింది. ఏకంగా 100 మంది ఫైటర్స్ , 300 మంది జూనియార్ ఆర్టిస్టు లతో ఈ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కుతున్నట్లు ఈ మూవీ యూనిట్ తెలిపింది.

ప్రస్తుతం చిత్రీకరిస్తున్న యాక్షన్ సన్నివేశం మూవీ కే హైలైట్ గా ఉండే ఛాన్స్ ఉన్నట్లు మేకర్స్ భావిస్తున్నారు. ఈ సినిమాలో అందాల భామ నభా నటేష్ హీరోయిన్‌ గా నటిస్తోండగా , భీమ్స్ సిసిరోలియో ఈ మూవీ కి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట , గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. ఇకపోతే గత కొంత కాలంగా వరుస అపజాయలను ఎదుర్కొంటున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ "టైసన్ నాయుడు" మూవీ తో ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: