మళ్ళీ : కేసీఆర్ ! కేసీఆర్ ! కేసీఆర్ ! షురూ !

Pandrala Sravanthi
కేసీఆర్.. ఈయన పేరు కేవలం తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా మార్మోగిపోతుంది. తెలంగాణ ప్రత్యేక ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా చేసిన గొప్ప నాయకుడు.  ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా  నిరాహార దీక్ష చేసి  నిరుద్యోగులను ఉద్యోగులను అమ్మలక్కలను, అక్కా చెల్లెళ్లను ముసలి ముతకా ఇలా అన్ని వర్గాలను ఏకం చేసి  ఉద్యమం బాట పట్టించారు. తెలంగాణ అంటే ఉద్యమం.. ఉద్యమం అంటే తెలంగాణ..అనే విధంగా చేయడంలో కేసీఆర్ ప్రముఖ పాత్ర పోషించారని చెప్పవచ్చు. అలాంటి కెసిఆర్ ఒకప్పుడు ఒక్కడిగా పార్టీ పెట్టి  చివరికి రాష్ట్రమంతా కెసిఆర్ అనే విధంగా చేసుకున్నాడు. రెండు పర్యాయాలు తెలంగాణను పాలించాడు.


 కానీ మూడవసారి ఎన్నికల్లో ఓటమిపాలయ్యాడు. అయినా తాను పట్టుకున్న నినాదాన్ని మర్చిపోకుండా తెలంగాణను నేను చచ్చేంత వరకు కాపాడుకుంటానని మాట్లాడుతూనే వస్తున్నారు.  ఆనాడు జూన్ రెండవ తేదీన తెలంగాణ ఆవిర్భావం జరిగినప్పుడు కేసీఆర్ ఒక్కడే. ఆ తర్వాత ఆయన పూర్తిస్థాయి మెజారిటీతో అధికారంలోకి వచ్చాడు. 2024 వచ్చేసరికి అధికారం కోల్పోయాడు. అలాంటి కెసిఆర్ ఇప్పటికి కూడా ఎక్కడ తడబడకుండా  తన స్టేటస్ తో  ముందుకు వెళ్తున్నాడు అని చెప్పవచ్చు. అలాంటి కెసిఆర్  సైలెంట్ గా ఉన్నాడు అంటే ఏదో ఒక ప్లాన్ చేస్తున్నాడని అర్థం. అయితే తాజాగా రాజకీయ పరిస్థితులను చూస్తే మాత్రం ఇక బీఆర్ఎస్ పని అయిపోయిందని అందరూ భావించారు. కానీ బీఆర్ఎస్ తెలంగాణ ఉన్నంత సేపు ఉంటుందని  మరోసారి నిరూపితమైంది.


అధికార కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. మహబూబ్ నగర్ స్థానిక ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో  బీఆర్ఎస్ విజయకేతనం ఎగరవేసింది. మహబూబబ్ నగర్  ఎమ్మెల్సీ స్థానం పరిధిలో మొత్తం 1439 మంది ఓటర్లు ఉన్నారు.  ఇందులో మార్చి 28వ తేదీన ఉప ఎన్నిక జరిగింది.  దీనికి సంబంధించి ఈరోజు కౌంటింగ్ జరిగింది. ఇందులో మన్నె జీవన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. నవీన్ కుమార్ రెడ్డి బిఆర్ఎస్ నుంచి చేశారు. సుదర్శన్ గౌడ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీపడ్డారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన నవీన్ కుమార్ రెడ్డి మొత్తం 111 ఓట్ల మెజారిటీతో  విజయం సాధించారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. షురూ అయింది కేసీఆర్ మళ్ళీ వస్తున్నారు, ఆనాడు ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావం ఏ రోజు అయితే జరిగిందో  మళ్లీ అదే రోజు బీఆర్ఎస్ మళ్లీ పుంజుకుంటుందంటూ  నాయకులంతా సంబరాలు చేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: