ఆ తేదీ నుండి ఓటీటీ లో "లవ్ మీ"..?

MADDIBOINA AJAY KUMAR
రౌడీ బాయ్స్ మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యాడు ఆశిష్ రెడ్డి. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకుల అంచనాలను ఏ మాత్రం అందుకోలేకపోయింది. దానితో ఈ మూవీ యావరేజ్ మూవీ గా మిగిలిపోయింది. ఇక ఈ సినిమా తర్వాత ఈ నటుడు లవ్ మీ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మంచి అంచనాల నడుమ మే 25 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల అయింది.

ఇకపోతే ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోరమైన నెగెటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ కి మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ వచ్చినప్పటికీ ఆ తర్వాత మాత్రం ఈ సినిమా కలెక్షన్ లు దారుణంగా పడిపోయాయి. దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద మొత్తంలో లాస్ ను చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకపోతే బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయిన ఈ సినిమా మరికొన్ని రోజుల్లో ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా యొక్క ఓ టీ టీ హక్కులను ఆహా డిజిటల్ సంస్థ వారు దక్కించుకున్నట్లు అందులో భాగంగా జూన్ 15 వ తేదీ నుండి ఈ సినిమాను ఆహా సంస్థ వారు తమ ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను మరో ఒకటి , రెండు రోజుల్లో విడుదల చేయబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది. ఇకపోతే ఆశిష్ కొంత కాలం క్రితం సెల్ఫిష్ అనే మూవీ ని మొదలు పెట్టి మధ్యలో ఆపేశాడు. మరి ఈ సినిమాను తిరిగి స్టార్ట్ చేస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: