ఏపీ( ఆళ్లగడ్డ): భూమా Vs గంగుల.. గెలిచేదేవరంటే.?

Pandrala Sravanthi
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అత్యంత కీలకమైన నియోజకవర్గంలో ఆళ్లగడ్డ నియోజకవర్గం కూడా  ఒకటి. ఈ నియోజకవర్గంలో రాష్ట్రంలోనే ఎంతో పేరు మోసినటువంటి భూమా,గంగుల ఫ్యామిలీలు పోటీలో ఉన్నాయి.  ఎప్పుడైనా సరే ఈ రెండు పార్టీల మధ్యనే ఆధిపత్యపూరు అనేది నడుస్తూ ఉంటుంది. అలాంటి ఈ తరుణంలో ఈసారి టిడిపి నుంచి భూమా అఖిలప్రియ బరిలో ఉండగా వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్ర రెడ్డి బరిలో ఉన్నారు. మరి ఇందులో ఎవరికి విజయ అవకాశాలు ఉన్నాయి. బ్యాలెట్ బాక్స్ లో ఎవరికి ఓట్లు పడ్డాయి అనే వివరాలు చూద్దాం.. 2019 ఎన్నికల్లో మాజీమంత్రి  అఖిల ప్రియ వైసీపీ అభ్యర్థి గంగుల బ్రిజేంద్ర రెడ్డి 30 వేల తేడాతో ఓడిపోయారు.

ఈ విధంగా గంగుల కుటుంబం 2004 మరియు 2019లో  ఆళ్లగడ్డలో పాగా వేసింది. అయితే ఈసారి కూడా గెలిచి తమ సత్తా ఏంటో చూపించాలి అనుకుంటుంది.  ఇదే తరుణంలో భూమా కుటుంబం 2009, 2014, 2019ఎన్నికల్లో వరుసగా విజయం సాధించింది. భూమా దంపతుల మరణం తర్వాత వీరి కుటుంబంలో చీలికలు వచ్చాయి.  భూమా నాగిరెడ్డి సోదరుల కుమారులు అఖిల ప్రియకు యాంటీగా మారారు.  అంతేకాకుండా తన మేనమామ ఎస్పీ మోహన్ రెడ్డి వైసీపీలో కీలక నేతగా ఉన్నారు. భూమా కుటుంబానికి అందరూ దూరమైనా కానీ భూమా అఖిల ప్రియ మాత్రం  ఓవైపు ఆళ్లగడ్డ మరోవైపు నంద్యాలలో  వారి మానియా చూపిస్తూనే వస్తున్నారు. ఇక నంద్యాలలో వారి పట్టు కాస్త తగ్గిపోవడంతో ఈసారి కేవలం ఆళ్లగడ్డ నియోజకవర్గంలో మాత్రమే అఖిలప్రియ కు సీట్ కేటాయించింది టిడిపి. 

దీంతో భూమా కుటుంబానికి శత్రువులు ఎక్కువ మిత్రులు తక్కువ అనే పరిస్థితి ఏర్పడింది. ఇదే అదును గా తీసుకున్న గంగుల కుటుంబం ఆళ్లగడ్డలో వారి పట్టును సాధిస్తూ వస్తున్నారు. అలాంటి ఈ తరుణంలో  ఈ ఎన్నికల్లో భూమా,గంగుల మధ్య విపరీతమైనటువంటి టఫ్ ఫైట్ ఏర్పడింది. కానీ అఖిలప్రియ కుటుంబం మాత్రం అక్కడ బలిజ సామాజిక వర్గం ఓట్లపై ఎక్కువ ఆశలు పెట్టుకుంది. అంతేకాకుండా జనసేన పొత్తు ఈసారి కలిసి వస్తుందని భావిస్తుంది. కానీ అఖిల ప్రియ వేసిన ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ  కొంతమంది భూమా కుటుంబీకులే ఆమెకు వ్యతిరేకంగా ప్రచారం చేశారట.  ఇన్ని అవాంతరాల మధ్య భూమా అఖిలప్రియ పోటీలో నిలబడింది.ఇదే తరుణంలో గంగుల బ్రిజేంద్ర రెడ్డి జగన్ తీసుకొచ్చిన పథకాలు,  ఆయన చేసిన అభివృద్ధిని ఆసరాగా చేసుకుని  ప్రచారంలో దూసుకెళ్లారు. జగన్ పథకాలే ఆయనను గెలిపిస్తాయనే ధీమాతో ఉన్నారు. మరి ఇంతటి టఫ్ ఫైట్ లో వైసీపీకే కాస్త ఫేవర్ గా ఉన్నట్టు కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: