బాబు వచ్చాడు... టిటిడి పై ప్రత్యేక దృష్టి..?

Pulgam Srinivas
దేశంలోనే అత్యంత ప్రసిద్ధి పొందిన దేవాలయాలలో తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటి. ఈ దేవస్థానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఈ దేవస్థానాన్ని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుండి మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నో దేశాల నుండి జనాలు వస్తూ ఉంటారు. దానితో వచ్చే జనాలకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం గొప్పతనం ప్రపంచవ్యాప్తంగా వ్యాపించడం కోసం ఇక్కడ ఎన్నో సౌకర్యాలను ప్రభుత్వాలు కల్పిస్తూ వచ్చాయి. 

ఉచిత భోజనం, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా దర్శనం, ఇంకా మరెన్నో వసతులను ఇక్కడ కల్పించారు. ఇక 2019 వ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఇక విరు అధికారంలోకి వచ్చాక తిరుమల తిరుపతి దేవస్థానం పై పెద్దగా ఫోకస్ పెట్టలేదు అని, ఇక్కడ ఇది వరకు ఉన్న వసతులు ఏమీ లేవు అని చాలా మంది ఆరోపణలు చేస్తూ వచ్చారు. దానితో తెలుగు దేశం పార్టీ మేము అధికారంలోకి వస్తే టీటీడీ కి మళ్లీ పూర్వ వైభవాన్ని తీసుకువస్తాము అని చెబుతూ వచ్చారు. 

ఇక తెలుగు దేశం పార్టీ అధికారం లోకి వచ్చింది. అధికారం లోకి వచ్చాక చంద్రబాబు నాయుడు టీటీడీ పై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు, ఇది వరకు అనేక వసతులు అక్కడ ఉండేవి, ఇప్పుడు ఆ వసతులు చాలా వరకు తగ్గాయి. ఇకపై టిటిడి మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకోబోతుంది. అక్కడ దైవత్వం ఉట్టిపడేలా ఎన్నో కార్యక్రమాలను నిర్వహించబోతున్నాం అని ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చాడు. మరి చంద్రబాబు నాయుడు వచ్చాక టీటీడీ పై ప్రత్యేక దృష్టి పెట్టబోతున్నట్లు దీనితోనే స్పష్టంగా అర్థం అవుతుంది. చంద్రబాబు టీటీడీ పై ప్రత్యేక దృష్టి పెడతాను అని ప్రకటించడంతో జనాలు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: