కూట‌మి ఖుషి : పవర్‌ ఫులో స్థానంలో పవన్‌ కళ్యాణ్‌...మనల్ని ఎవడ్రా ఆపేది ?

Veldandi Saikiran
* మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలవడం
* డిప్యూటీ స్పీకర్‌ హోదా
* కేంద్రం, ఏపీలో చక్రం తిప్పే సత్తా
* 100 శాతం స్ట్రైక్‌ రేట్‌
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో...  అందరికన్నా ఎక్కువ జనసేన పార్టీలో ఊపు వచ్చిందని చెప్పవచ్చు. ఆ పార్టీ కార్యకర్తలు అలాగే నేతలు కూడా ఫుల్ జోష్ ఉన్నారు. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిందనే దానికంటే... పవన్ కళ్యాణ్ మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలవడం... ఆ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నెలకొల్పింది. 2019 ఎన్నికల్లో... రెండు చోట్ల పోటీ చేసిన పవన్ కళ్యాణ్... అత్యంత దారుణంగా ఓడిపోయారు.

అయినప్పటికీ ఎక్కడ తగ్గకుండా...  పడ్డ చోటే నిలబడాలని... మరోసారి ఏపీలో గెలిచి చూపించాడు పవన్ కళ్యాణ్. ఈసారి తెలివిగా పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ... దాదాపు 70 వేల పై చిలుకు ఓట్ల మెజారిటీతో... పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా... ఏకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా... జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారం కూడా చేశారు.

ఏపీ ఉప ముఖ్యమంత్రి కావడమే కాకుండా... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, పర్యావరణ, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ  మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టబోతున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అంటే దాదాపు... ఏపీలో కీలక పదవిలో పవన్ కళ్యాణ్ ఉన్నారన్నమాట. 2014 సంవత్సరంలో జనసేన పార్టీని పెట్టిన పవన్ కళ్యాణ్...  ఎన్నో కష్టాలు, సవాళ్లు... అనేక అవమానాలు... ఎన్నో అనుభవించారు. సరిగ్గా పది సంవత్సరాల తర్వాత.... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శాసించే... ఎదిగారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. తనకు మంత్రి పదవులు తెచ్చుకోవడమే కాకుండా... మరో ఇద్దరికి మంత్రి పదవులు... ఇప్పించుకున్నారు పవన్ కళ్యాణ్.
అంతేకాకుండా భవిష్యత్తులో... పార్టీ కోసం కష్టపడ్డ నాయకులందరికీ... ప్రభుత్వంలో భాగస్వాములు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు పవన్ కళ్యాణ్. వందకు వందశాతం ఎమ్మెల్యేలను గెలిపించుకోవడం కూడా.... జనసేన పార్టీకి మంచి ఊపు తీసుకువచ్చింది. భవిష్యత్తులో... ఏపీలో అతిపెద్ద పార్టీగా జనసేన కూడా అడుగులు వేసేలా  కూటమి విజయం తోడ్పడింది. ఇదే ఊపు కొనసాగిస్తే... భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్  కావడం గ్యారెంటీ అని జనసేన   నాయకులు... చాలా ఆనందంగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: