జగన్: నేతలతో భేటీ.. భారి కసరత్తు దిశగా అడుగులు..!

Divya
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికలలో ఘోరంగా ఓడిపోవడంతో ఈసారి ఎన్నికలకు భారీ కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మొన్నటి రోజున ఎమ్మెల్సీలతో మీటింగ్ పెట్టి మాట్లాడడం జరిగింది. మరొక రోజున ఎంపీలతో మీటింగ్.. విరంతా పూర్తి అయిన తర్వాత ఇప్పుడు అసలు కార్యక్రమం మొదలు కాబోతోంది. 19వ తారీఖున బుధవారం ఉదయం 10:30 గంటలకు విస్తృతస్థాయిలో సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి గెలిచిన ఎమ్మెల్యేలతో పాటు , ఇటీవలే సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన వాళ్లందరితో కూడా మాట్లాడబోతున్నారు.

వీళ్లతో పాటు ఎంపీలు మినహా పార్లమెంటు పోటీ చేసిన అభ్యర్థులు గెలిచినటువంటి అభ్యర్థులను కాకుండా ఓడినటు వంటి అభ్యర్థులను కూడా పిలిచారు. వీరందరితో కూర్చొని ఏం చేయబోతున్నారు అసలు ఏం జరిగింది.. ఎలా జరిగింది.. ఎందుకు ఈ వైఫల్యం అనే విషయం పైన చర్చ చేయబోతున్నట్లు సమాచారం. ఓటమి తర్వాత పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందుబాటులో జగన్ ఉండరు అనే విషయాన్ని చాలా మంది టీడీపీ నేతలు ఎద్దేవా చేశారు.. కానీ ఇప్పుడు ఏకంగా అందరికీ అందుబాటులో ఉండేలా ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్తున్నారు.

వరుసగా ఆ యానాయకులతో కూడా ఇంట్రాక్ట్ అవుతూ మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. అంతేకాకుండా రాబోయే రోజులలో  అన్ని నియోజకవర్గాలలో కూడా మరొకసారి తాను పర్యటించడానికి సిద్ధంగా కూడా ఉన్నారని వెల్లడించారు జగన్మోహన్ రెడ్డి.. అయితే ఇటీవల కూడా ఈవీఎంల పైన కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా ఈవీఎంల కంటే పేపర్ బ్యాలెట్లు వాడకాన్ని ఎక్కువగా వాడాలంటూ కూడా డిమాండ్ చేయడం జరిగింది. గత కొద్దిరోజులుగా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎలాన్ మాస్క్ కూడ ఈ విషయం పైన స్పందించడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో ఈ విషయాల పైన ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: