రఘురామకు కీలక పదవి..జగన్‌ కూడా వణికిపోవాల్సిందే ?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన నేపథ్యంలో... ఇప్పుడు ఏపీలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎవరు అవుతారు అనే దానిపైన చర్చ జరుగుతుంది. ఎన్నికల ఫలితాలు ముగిసినప్పటి నుంచి ఇప్పటివరకు అనేక పేర్లు తెరపైకి వచ్చాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్గా... అయ్యన్నపాత్రుడు ఫైనల్ కాబోతున్నారని కొంతమంది జోరుగా ప్రచారం చేశారు. చంద్రబాబు కూడా అయ్యన్నపాత్రుడికి... మంత్రి పదవి ఇవ్వలేదు.

మంత్రి పదవి స్థానంలో... అసెంబ్లీ స్పీకర్ గా అయ్యన్నపాత్రుడికి ఛాన్స్  ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారట చంద్రబాబు. ఇక ఆయన పేరు తప్ప స్పీకర్ గా ఎవరి పేరు వినిపించడం లేదు.  ఇక ఇప్పుడు అంతా డిప్యూటీ స్పీకర్ పదవి పైన ఉంది. నిన్నటి నుంచి డిప్యూటీ స్పీకర్గా జనసేనకు అవకాశం ఇస్తారని... వార్తలు వచ్చాయి. ఇందులో భాగంగానే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, లేదా నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవికి ఇస్తానని జోరుగా ప్రచారం అయితే జరిగింది.

వీరిద్దరూ కాదనుకుంటే మళ్లీ టిడిపికి చెందిన  సీనియర్ లీడర్ ను ఫైనల్ చేసేందుకు చంద్రబాబు సిద్ధమైనట్లు వార్తలు వచ్చాయి. అయితే... ఈ తరుణంలోనే  ఉండి నియోజకవర్గం నుంచి  ఎమ్మెల్యేగా గెలిచిన  రఘురామకృష్ణ రాజుకు... డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తారని.. కొత్తగా వార్తలు వస్తున్నాయి. క్షత్రియ సామాజిక వర్గం నుంచి.. ఎవరికి పదవులు రాలేదు.
ఈ తరుణంలోనే రఘురామకృష్ణ రాజుకు...  డిప్యూటీ స్పీకర్ పదవి కట్ట పెడతారని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ  రఘురామకృష్ణ రాజుకు ఆ పదవి రాకపోతే.. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి... రఘు రామకు ఇచ్చేందుకు చంద్రబాబు డిసైడ్ అయ్యారట. రాజకీయ అనుభవం, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేయగల సత్తా ఉన్న నాయకుడు రఘురామకృష్ణరాజు. వైసిపి పాలనలో చాలా కష్టాలు పడ్డారు. అందుకే కచ్చితంగా రఘురామకృష్ణ రాజుకు కీలక పదవి ఇచ్చేందుకే చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: