ఖర్గే ప్లాన్‌: మోదీ ప్రభుత్వం త్వరలో కూలిపోతుందా?

మోదీ మూడో సారి ప్రమాణ స్వీకారం చేసి కేంద్రంలో ఎన్డీయే సంకీర్ణ సర్కారుని ఏర్పాటు చేశారు.. బీజేపీకి 240 స్థానాలే రావడంతో మ్యాజిక్ ఫిగర్ కు ఇంకా 32 స్థానాలు అవసరం అయ్యాయి. ఫలితంగా ఎన్డీయే భాగస్వామ్య పక్షాల మద్దతు అవసరం అయింది. ముఖ్యంగా టీడీపీ, జేడీయూ సహకారంతో పాటు 21 పార్టీల మద్దతు తప్పని సరి అయింది.

అయితే దీనిపై కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందిస్తూ.. ఎన్డీయే సర్కారు పొరపాటున ఏర్పడింది అని.. అది ఎప్పుడైనా కూలిపోవచ్చు అని అన్నారు. మోదీకి మెజార్టీ లేదని.. ఇది మైనార్టీ ప్రభుత్వం అని తెలిపారు. మెజార్టీ లేకుండా ఏర్పాటయ్యే కిచిడీ ప్రభుత్వాలు ఏ క్షణంలో అయినా కూలిపోతాయి అంటూ ఇండియా కూటమిని ఉద్దేశించి ప్రధాని మోదీ పలుమార్లు చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశారు.

మరి కేంద్రంలో మోదీ మైనార్టీ ప్రభుత్వాన్ని నడుపుతున్నారా అంటే.. ఎన్నికలకు ముందు  నుంచే ఆయా పార్టీలతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. ఈ లెక్కన చూసుకుంటే ఎన్డీయే కూటమిని ప్రజలు ఆదరించినట్లే. వాస్తవానికి ఎన్నికల తర్వాత సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినా దానిని మైనార్టీ అని అనలేం. బీజేపీ చాలా స్పష్టంగా సార్వత్రికానికి ముందు పొత్తులు పెట్టుకొని ఎన్నికలకు వెళ్లింది. అందువల్ల ఇది మైనార్టీ ప్రభుత్వం అనడానికి లేదు.

ఒకవేళ ఎన్డీయే కూటమికి మెజార్టీ లేదు.  మ్యాజిక్ ఫిగర్ కు దూరంగా ఉండి.. కొత్త మిత్రపక్షాలను కలుపుకోకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అప్పుడు మైనార్టీ ప్రభుత్వం అని అనవచ్చు. ఎన్నికల  తర్వాత ఏమైనా మోదీ కొత్త మిత్రులను కలుపుకొన్నారా అంటే అదీ లేదు. మరి ఈ ప్రభుత్వం పడిపోతుందా లేదా అంటే రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు. దానిని ఎవరూ ఊహించలేం. నిన్నటి శత్రువులే.. నేటి మిత్రులు. ఈ ఏడాది జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ఆధారంగా ఎన్డీయే సర్కారు ఐదేళ్లు అధికారంలో ఉంటుందా ఉండదా అనేది తేలుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: