జనసేన మంత్రి నాదెండ్ల సంచలన ఆదేశాలు..!

Divya
ఆంధ్రప్రదేశ్లోని కూటమి భారీ విజయాన్ని అందుకుంది. కూటమి విజయానికి భాగమైన జనసేన పార్టీని కూడా చంద్రబాబు కీలకమని భావించారు. దీంతో చంద్రబాబు నాయుడు కూడా జనసేన మంత్రులకు పదవులు కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా జనసేన మంత్రి నాదెండ్ల మనోహర్ కి కూడా పౌరసరఫరాల శాఖను ఇవ్వడం జరిగింది. అయితే అలా పగ్గాలు చేపట్టగానే తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం అంటే నిరంతర స్థాయి ప్రక్రియ.. ప్రభుత్వం అంటేనే ఒక వ్యక్తి చుట్టూ తిరుగుతా ఉండకూడదు.. అధికారుల చుట్టూ తిరుగుతా ఉండకూడదు.. ప్రజల చేత ఎన్నికైన ప్రజాపదులు మంత్రులుగా ఎంపిక చేసాక వాళ్ళకి ఇచ్చే స్వేచ్ఛ వాళ్లకి ఉండాలి.

అయితే పూర్తి స్వేచ్ఛ ఇవ్వకపోయినా పర్వాలేదు వాళ్ళ పని వాళ్ళు చేసేలా ఉండాలి.. వైసీపీకి లోపించింది ఇదే ..తెలుగుదేశం కూటమి మంత్రులకు ఉపయోగపడింది. తాజాగా చూస్తే ఒక్కొక్క మంత్రి తమ శాఖలతో చర్చలు జరుపుతూ ఉన్నారు. శాఖల పైన విశ్లేషిస్తూ ఉన్నారు. ముఖ్యంగా నాదెండ్ల మనోహర్ వంటి వారు గోడౌన్లకు వెళ్లి మరి తనిఖీలు చేస్తున్నారు. మంగళగిరి, గోదావరి వంటి ప్రాంతాలలో  గోడౌన్ లో తనిఖీ చేయించారు. ముఖ్యంగా అక్కడ వేసేటువంటి పరిణామాలలో కంటే తూకం తక్కువగా ఉందంటూ గుర్తించారట. తనిఖీలలో తేలింది.

దీంతో రాష్ట్రవ్యాప్తంగా కందిపప్పు, పంచదార, నూనె  తదితర ప్యాకెట్లు నిలిపివేయమన్నారు.. వారం రోజుల లోపు వీటీకి సంబంధించి సమగ్ర ఆదేశాలను ఇవ్వమని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ఇది అత్యంత ముఖ్యమైనటువంటి పని.. నాయకులు చేయవలసిన పని ప్రజలు కోరుకుంటున్నటువంటి పని ఇదే అని చెప్పవచ్చు. మరి రాబోయే రోజుల్లో టిడిపి మంత్రులు కూడా ఇలానే అన్ని చోట్ల కూడా పనులు చేసి మరింత పేరు తెచ్చుకుంటారేమో చూడాలి మరి. ఏది ఏమైనా జనసేన నేతలు కార్యకర్తలు సైతం ఒక్కొక్కరుగా ఆంధ్రప్రదేశ్లో పెరుగుతూ మంచి పాపులారిటీ సంపాదించుకుంటూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: