మూడ్ ఆఫ్ ఏపీ : ఫ్యాన్ దే ప్రభంజనం.. జగన్ మాటతో కూటమికి అధికారం కల్లేనా?
జగన పాలన, నాయకత్వం విషయంలో ప్రజల్లో నమ్మకం, విశ్వాసం ఉన్నాయి. ఈ ఎన్నికల్లో వైసీపీకి రికార్డ్ స్థాయిలో ఓట్లు పోల్ అయ్యాయి. రాష్ట్రంలో పోలింగ్ శాతం సైతం ఊహించని స్థాయిలో పెరిగింది. 2019లో వచ్చిన సీట్లతో పోల్చి చూస్తే ఎక్కువ సీట్లు వస్తాయని జగన్ ప్రకటన చేశారు. జగన్ ఏ ప్రకటన చేసినా ఆ ప్రకటనలను ఆచితూచి చేశారు. జగన్ సంచలన ప్రకటనతో కూటమి నేతలు డీలా పడ్డారని తెలుస్తోంది.
పేదలు వర్సెస్ పెత్తందారులు అనే నినాదంతో ఎన్నికల్లో పోటీ చేసిన జగన్ వేర్వేరు సమీకరణలు పరిశీలించి జగన్ తాజాగా సంచలన ప్రకటన చేశారని భోగట్టా. వైసీపీ అభ్యర్థుల విషయంలో సైతం జగన్ కచ్చితమైన నిర్ణయాలను తీసుకోవడం జరిగింది. దమ్ము, ధైర్యంతో అభ్యర్థులను మార్చిన జగన్ తనను నమ్మిన వాళ్లను కచ్చితంగా గెలిపించుకుంటానని బలంగా విశ్వసిస్తున్నారు.
జగన్ ఫస్ట్ రియాక్షన్ ఏపీ రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. టైట్ ఫైట్, ఎడ్జ్ అని రాసిన పత్రికలు సైతం జగన్ కామెంట్లతో ఆ లెక్కలను మార్చుకోవాల్సిన పరిస్థితి అయితే ఉండాలి. జగన్ ఎంతో నమ్మకంతో చేసిన దృఢమైన ప్రకటన ఆటంబాంబులా పేలిందనే చెప్పాలి. వై నాట్ 175 నినాదాన్ని జగన్ నిజం చేస్తారేమో చూడాల్సి ఉంది. ఏపీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత రాష్ట్రంలో మళ్లీ వైసీపీ తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి రావడం ఖాయమని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.