మూడ్ ఆఫ్ ఏపీ: మోడీ, ప‌వ‌న్‌, బాబు, ష‌ర్మిల త‌ల ఎక్క‌డ పెట్టుకుంటారు ?

Pulgam Srinivas
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని రోజుల క్రితమే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ముగిసాయి. ఈ ఎలక్షన్లలో ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ అయినటువంటి వైసీపీ ఒంటరిగా పోటీలోకి దిగితే, టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీలు కలిపి పొత్తుల భాగంగా పోటీలోకి దిగాయి. ఇక షర్మిల ఒంటరిగానే పోటీలోకి దిగిన ఆమె పెద్దగా ప్రభావం చూపడం లేదు. దానితో ఆమె కూడా ఇన్ డైరెక్ట్ గా కూటమికే సపోర్ట్ చేస్తున్నట్లు అనేక కథనాలు వచ్చాయి. ఇక ఇవన్నీ విషయాలను పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక్కడు ఒక వైపు నిలబడితే , టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ నాలుగు పార్టీలు ఒక వైపు నిలబడ్డాయి.

ఈ నాలుగు పార్టీలు కూడా కచ్చితంగా ఈ సారి జగన్ ను ఓడించాలి అనే పట్టుదలతోనే మొదటి నుండి ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాయి. ఎలక్షన్ల తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెబుతూ వస్తున్నారు. కొంతమంది కూటమి అభిమానులు ఈసారి వైసీపీ పార్టీ పెద్ద స్థాయిలో సీట్లను దక్కించుకోలేదు. పోయినసారి ఏదో అలా జరిగింది. కానీ అలా ఈ సారి జరగదు ఈ సారి కూటమి ఎక్కువ స్థానాలను గెలుచుకుంటుంది అని చెబుతూ ఉంటే .... వైసీపీ అభిమానులు మాత్రం వైసీపీ స్వల్ప మెజారిటీతో అయినా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నెలకొల్పుతుంది అని చెబుతూ వచ్చారు.

ఇక ఈ మాటలన్నింటికీ వైసీపీ పార్టీ అధినేత అయినటువంటి జగన్ తాజాగా పెద్ద షాక్ ఇచ్చాడు. ఆయన తాజాగా ఐ ప్యాక్ సిబ్బందితో సమావేశం అయ్యారు. అందులో భాగంగా జగన్ మాట్లాడుతూ పోయిన సారి 151 అసెంబ్లీ సీట్లు వస్తాయి అంటే ఎవరు నమ్మలేదు. అదే జరిగింది మేము అధికారంలోకి వచ్చాము. ఈ సారి కూడా మేము అంతకన్నా ఎక్కువ సీట్లను సాధించి అధికారంలోకి రాబోతున్నాము. అలాగే పోయినసారి కంటే ఎక్కువ పార్లమెంట్ స్థానాలను సాధించబోతున్నాము. 
మరికొన్ని రోజుల్లో రాబోయే రిజల్ట్ ను చూసి దేశం షాక్ కాబోతుంది అని చెప్పాడు. దీనితో ఓటమి విజయాన్ని కోరుకున్న వారంతా షాక్ కి గురయ్యారు.

ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే ఇలా చెబుతాడు. కచ్చితంగా గెలిచే ఉద్దేశం ఉంది కాబట్టి అలా చెప్పాడు అని జగన్ ఓటమిని కోరుకునే వర్గాలు చెబుతున్నాయి. ఒక వేళ నిజంగానే జగన్ కనుక స్వల్ప మెజారిటీతో అయినా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నెలకొల్పినట్లు అయితే ఆయన ఓటమిని మొదటి నుండి కోరుకుంటూ వస్తున్న ప్రధాన నేతలు అయినటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీ, షర్మిల వారి తలలను ఎక్కడ పెట్టుకుంటారు రాష్ట్రంలో వారి పరిస్థితి ఎలా ఉంటుంది అనే ఆలోచనలు ఆంధ్ర ప్రజల్లో రేకెత్తాయి. మరి జగన్ ప్రభుత్వం ఈ సారి ఎలక్షన్లలో ఎలాంటి రిజల్ట్ ను తెచ్చుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ap

సంబంధిత వార్తలు: