టిడిపి: మహిళా శక్తి నిండా ముంచుతుందా..?

Divya
ఈనెల 4వ తేదీన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలుబడుతున్నాయి. ఇందుకోసం రాష్ట్ర ప్రజలంతా కూడా చాలా ఎక్సైటింగ్ గా ఎదురుచూస్తున్నారు. అయితే ఈలోపు జూన్ 1వ తేదీన అంటే ఈరోజు ఎగ్జిట్ పోల్స్ వెలబడనున్నాయి. దేశంలో ఆఖరి విడత పోలింగ్ కూడా ఈరోజు ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్చని బహిరంగంగా ప్రకటించేందుకు అన్ని సర్వే సంస్థలు కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. శనివారం సాయంత్రం 6 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయబోతున్నారు. ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల పైన రాజకీయ పార్టీల చాలా ఉత్కంఠత నెలకొన్నట్లు కనిపిస్తోంది.

 ఈ ఎన్నికలలో ఎవరు విజయాన్ని అందుకుంటారనే విషయం కోసం రాష్ట్ర ప్రజలు చాలా ఉత్కంఠంగా చూస్తున్నారు. పోలింగ్ తర్వాత ఓటర్ల నాడి ఎలా ఉందని విషయం పైన పలువురు రాజకీయ నాయకులకు మాత్రం అంత చిక్కడం లేదు. గతంలో మాదిరిగా సర్వే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయని విషయాన్ని కూడా చెప్పలేకపోతున్నారు విశ్లేషకులు.. అయితే ఈ ఎన్నికల్లో గెలుపు ఓటంలో నిర్ణయించేది మహిళలని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.. మహిళా ఓటర్లు అత్యధిక సంఖ్యలో ఉండడమే ఇందుకు ముఖ్య కారణమని కూడా తెలుస్తోంది.

మహిళలు ఎక్కువగా ఎవరికి అండగా ఉంటే ఆ పార్టీని అధికారంలోకి వస్తుందని పలువురు రాజకీయ విశ్లేషకులు కూడా వెల్లడిస్తున్నారు.. ప్రస్తుతం వస్తున్న నివేదికల ప్రకారం సర్వే రిపోర్ట్ లలో ఏపీలో మహిళలు అధికంగా వైసిపి పార్టీ వైపే ఉన్నట్లుగా తెలియజేస్తున్నారు.. ఏపీలో 8.4 లక్షల మంది మహిళలు కొత్త ఓట్లు చేరాయని ఇందులో మెజార్టీ మహిళలు వైసీపీ మద్దతుగానే నిలిచారని తెలుస్తోంది. వీటికి తోడు సంక్షేమ పథకాలతో పాటు నేరుగా మహిళల బ్యాంకు అకౌంట్లో డబ్బులు వేయడం.. పింఛన్ ఇంటికి తీసుకువెళ్లడం.. వంటివి బాగుండడంతో మహిళలు జగన్ కి ఓటు వేసి ఉండవచ్చని తెలుపుతున్నారు విశ్లేషకులు. ఉదయం 7 నుంచి మహిళా ఓటర్లు పెద్ద ఎత్తున ఓటింగ్ ని వినియోగించుకున్నారు. అయితే ఇదంతా వైసిపి ప్రభుత్వం వ్యతిరేకత ఓట్లని టిడిపి నాయకులు చెబుతున్నారు.ఒకవేళ టిడిపి పార్టీ ఓడిన అది మహిళా ఓట్ల వల్లే ఓడుతుందని పలువురు నేతలు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: