కోహ్లీపై కామెంట్స్.. యూటర్న్ తీసుకున్న రాయుడు?

praveen
టీమిడియాలో స్టార్ ప్లేయర్గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా అతన్ని రికార్డుల రారాజు అని పిలుచుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఎంతోమంది లెజెండరీ క్రికెటర్స్ కెరియర్ కాలం మొత్తంలో సాధించిన రికార్డులను విరాట్ కోహ్లీ ఎంతో అలవోకగా బద్దలు కొట్ట గలిగాడు. అయితే కేవలం రికార్డులను సాధించడం విషయంలోనే కాదు అటు సోషల్ మీడియాలో ఫాలోవర్లను సంపాదించుకోవడం విషయంలో కూడా కోహ్లీ తనకు తాను తోపు అని నిరూపించుకున్నాడు.

 ఈ క్రమంలోనే ఎప్పుడు అద్భుతమైన ఆట తీరుతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటాడు విరాట్ కోహ్లీ. ఇక టీమిండియా విజయాలలో కీలక పాత్ర వహిస్తూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే. అలాంటి విరాట్ కోహ్లీ గురించి ఏ చిన్న విషయం బయటకు వచ్చిన అది తెగ హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. అయితే గత కొన్ని రోజుల నుంచి టీమిండియా మాజీ ప్లేయర్ అంబటి రాయుడు విరాట్ కోహ్లీని టార్గెట్ చేస్తూ చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారిపోతున్నాయి. కొంతమంది ప్లేయర్లు వ్యక్తిగత రికార్డుల కోసం చూసుకుంటారు తప్ప.. జట్టు ప్రయోజనాలను పక్కన పెడతారు అంటూ వ్యాఖ్యానించారు. అయితే ఆరెంజ్ క్యాప్ గెలిచినంత మాత్రాన జట్టును గెలిపించలేరూ అంటూ మరికొన్ని కామెంట్స్ చేశాడు. అయితే ఇలాంటి వ్యాఖ్యల్లో అటు కోహ్లీ పేరును ప్రస్తావించకపోయినా రాయుడు కోహ్లీని టార్గెట్ చేశాడు అన్న విషయం అందరికీ అర్థమైంది.

 అయితే ఇప్పుడు రాయుడు మరోసారి యూటర్న్ తీసుకొని కోహ్లీ పై ప్రశంసలు కురిపించాడు. రేపటి నుంచి ప్రారంభం కాబోయే టి20 వరల్డ్ కప్ లో టీమిండియా స్టార్ క్లియర్ విరాట్ కోహ్లీ ప్రదర్శన కీలకం కాబోతుంది అంటూ మాజీ క్రికెటర్ అంబటి రాయుడు అన్నాడు. ఎంతో అనుభవం కలిగిన కోహ్లీ భారత జట్టులో టాప్ ఆటగాడు. ఆయన ఒక బిగ్ మ్యాచ్ ప్లేయర్. ఆయన బ్యాటింగ్ దూకుడు తనం టీమిండియా కు సానుకూలం. చివరి t20 వరల్డ్ కప్ లోను పాకిస్తాన్ పై కోహ్లీ ఇన్నింగ్స్ ను చూసాం అంటూ అంబటి రాయుడు ప్రశంసలు కురిపించాడు. అయితే కోహ్లీ పై విమర్శలను అంబటి రాయుడు కుటుంబానికి వార్మింగ్లు వచ్చాయి.  ఇలాంటి పరిణామాల నేపథంలోనే రాయుడు యూటర్న్ తీసుకున్నాడు అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: