ఎగ్జిట్ పోల్స్ అంటే ఏమిటి.. ఇంతకీ ఎవరిస్తారు?

praveen
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఎన్నికల హడావిడి ఉంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో కూడా పలు విడుదలుగా అటు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరుగుతుంది. ఇక కొన్ని రాష్ట్రాలలో లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ కూడా జరిగింది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ అన్ని ఫలితాలు జూన్ 4వ తేదీన విడుదల కాబోతున్నాయి.

 ఎవరు విజేతగా నిలుస్తారు అనే విషయంపై తీవ్రస్థాయిలో ఉత్కంఠ నెలకొంది అని చెప్పాలి. అయితే నేడు కూడా పలు రాష్ట్రాలలో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సాయంత్రం 6:30 గంటలు తర్వాత ఎగ్జిట్ పోల్స్ బయటకు రాబోతున్నాయి. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ కోసం దేశ ప్రజలందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఈసారి కేంద్రంలో, రాష్ట్రాలలో ఎవరు అధికారాన్ని చేపడతారు అనే విషయంపై ఎన్నో సంస్థలు సర్వేలు నిర్వహించి ఎగ్జిట్ పోల్స్ ప్రకటిస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే.

 ఇక ఈ ఎగ్జిట్ పోల్స్ లో వచ్చిన రిజల్ట్స్ దాదాపుగా కరెక్ట్ అయి ఉంటాయి. దీంతో ఎవరిది గెలుపు అనే విషయంపై ఒక క్లారిటీ వస్తుంది. ఇంతకీ ఎగ్జిట్ పోల్స్ అంటే ఏమిటంటే.. ఎన్నికల పోలింగ్ జరిగేటప్పుడు పోలింగ్ పూర్తయిన తర్వాత వివిధ ఏజెన్సీలు సర్వేలు చేస్తాయి. ప్రజల అభిప్రాయాలను సేకరించి ఏ పార్టీకి మెజారిటీ వస్తుంది. ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇక ఏ పార్టీ ఓడిపోతుంది అని అంచనా వేస్తాయి. యాక్సిస్ మై ఇండియా, సి ఓటర్, చాణక్య, టైమ్స్ నౌ, ఇండియా టుడే, సీఎన్ఎక్స్, ఏబీపీ తదితర సంస్థలు సర్వేలు నిర్వహించి ఎగ్జిట్ పోల్స్  పక్కాగా చెప్పి ప్రాచుర్యం పొందాయి అని చెప్పాలి. అయితే ప్రతిసారి ఇలా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజం అవుతాయి అని కూడా చెప్పలేం. ఎన్నోసార్లు తలకిందులు అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ap

సంబంధిత వార్తలు: