బైబై హైద‌రాబాద్ : ఏపీ జ‌నాల ఉద్యోగ‌, ఉపాధిపై ఎఫెక్ట్‌...!

RAMAKRISHNA S.S.
- విభ‌జ‌న చ‌ట్టం హామీలు జూన్ 2తో క్లోజ్‌
- తెలంగాణ ప్ర‌భుత్వ నియామ‌కాల్లో ఏపీ వాళ్లు పొరుగోళ్లే
( హైద‌రాబాద్ - ఇండియా హెరాల్డ్ )
మ‌రో మూడు రోజుల్లో హైద‌రాబాద్ తెలంగాణ రాజ‌ధానిగానే ప‌రిమితం కానుంది. ముఖ్యంగా విభ‌జ‌న చ ట్టంలో పేర్కొన్న ఉమ్మ‌డి రాజ‌ధానిగా హైద‌రాబాద్‌కు ప‌దేళ్ల వ‌య‌సు తీరిపోతుంది. దీంతో ఏపీకి ఉమ్మ‌డి రాజ‌ధాని అనే మాట ఇక‌పై ఉండ‌దు. అయితే.. మాన‌సిక బంధం కొన‌సాగుతుంది. ఎందుకంటే.. ఏపీ ప్ర‌జ‌లు హైద‌రాబాద్‌తో బంధం పెన‌వేసుకున్నారు. అయితే.. ఉమ్మ‌డి రాజ‌ధానిగా వెళ్లిపోవ‌డంతో.. హైద‌రాబాద్‌తో వ‌చ్చే రెండు న‌ష్టాలు ఏపీ ప్ర‌జ‌లకు శాపంగా మార‌నున్నాయి.

వీటిలో ప్ర‌ధానంగా ఉద్యోగాలు. హైద‌రాబాద్‌లో తెలంగాణ ప్ర‌భుత్వం భ‌ర్తీ చేసే అన్ని ఉద్యోగాల్లోనూ విభ‌జ‌న చ‌ట్టం మేర‌కు ఏపీకి కొంత వాటా ఉంది. అయితే.. ఇది ప‌దేళ్ల‌కు మాత్ర‌మే ప‌రిమితం చేశారు. ఇది జూన్ 2వ తేదీతో అయిపోతుంది. ఇక‌, నుంచి తెలంగాణ ప్ర‌భుత్వం ఇచ్చే ప్ర‌తి నోటిఫికేష‌న్ లోనూ ఏపీ ప్ర‌జ‌ల‌కు కోటా ఎత్తేస్తారు. దీంతో అక్క‌డ భ‌ర్తీ చేసే ప్ర‌భుత్వం ఉద్యోగాల్లో ఏపీ విద్యార్థులు.. నిరుద్యోగులు.. పొరుగు రాష్ట్రాల వారిగానే ప‌రిగ‌ణించ‌బ‌డ‌తారు. త‌ద్వారా అవ‌కాశాలు భారీగా త‌గ్గ‌నున్నాయి.

ఇది ఇప్ప‌టివ‌ర‌కు ఉన్న అవ‌కాశాల‌ను కోల్పోయిన‌ట్టు చేస్తుంద‌న‌డంలో సందేహం లేదు. ఇక‌, ఉపాధి ప‌రంగా చూసుకుంటే.. దీనిపై పెను ప్ర‌భావం చూపించ‌క‌పోయినా.. ప్ర‌భుత్వాల నుంచి అందే రాయితీ లు.. ఇత‌రత్రా స‌బ్సిడీలు మాత్రం అంద‌వు. ప్రైవేటు రంగంలో మాత్రం.. ఇప్పుడు కొన‌సాగుతున్న నైపు ణ్యం ఆధారంగా మాత్ర‌మే ఉపాధి క‌ల్ప‌న కొన‌సాగుతుంది. అయితే.. తెలంగాణ‌లో పెరుగుతున్న యువత కార‌ణంగా ఈ ఉపాధి కూడా దెబ్బ‌తినే అవ‌కాశం ఉంది.

ఈ రెండు రంగాల్లోనూ ఏపీ విద్యార్థులు, యువ‌త‌కు హైద‌రాబాద్ ఇత‌ర రాష్ట్రాల రాజ‌ధానుల్లో ఎలాంటి అవ‌కాశాలు ఉంటాయో.. అవే ఉండ‌నున్నాయి. అయిన‌ప్ప‌టికీ.. ప్ర‌భావం మాత్రం ఎక్కువ‌గానే ఉండనుం ది. ఇది ఏపీలో ఏర్ప‌డే నూత‌న న‌గ‌రాలు.. రాజ‌ధాని వంటి అంశాల‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. ఇక్క‌డ కూడా గ‌త ఐదేళ్ల మాదిరిగానే వ‌చ్చే ఐదేళ్లు కూడా ప‌రిస్థితి ఉంటే.. అప్పుడు మ‌రిన్ని ఇబ్బందులు వ‌స్తాయ‌న‌డంలో సందేహం లేదు. సో.. ఈ రెండు రంగాలు కూడా హైద‌రాబాద్ లేక‌పోవ‌డంతో ఏపీకి ఇబ్బంద‌నేన‌ని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: