మంగళగిరిలో లోకేశ్ మెజార్టీ లెక్క ఇదే.. లావణ్యకు భారీ షాక్ తగలనుందా?

Reddy P Rajasekhar
మంగళగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలవాలనేది నారా లోకేశ్ కల అనే సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లోనే గెలుపు కోసం నారా లోకేశ్ ఎంతో కష్టపడినా జగన్ వేవ్ వల్ల ఆ సమయంలో లోకేశ్ కు భారీ షాక్ తగిలింది. మంగళగిరి నియోజకవర్గం నుంచి రెండోసారి లోకేశ్ పోటీ చేస్తుండగా వైసీపీ సిట్టింగ్ ను కాదని ఎంతోమంది అభ్యర్థులను మార్చి చివరకు మురుగుడు లావణ్యకు టికెట్ కన్ఫామ్ చేసింది.
 
లోకేశ్, లావణ్య మధ్య పోటీతో రాజధాని ప్రాంతంలో రసవత్తర పోరు మొదలు కాగా లోకేశ్ సులువుగా 10 వేల ఓట్ల మెజార్టీతో గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో గెలుపు కోసం ఇరు పార్టీలు భారీ మొత్తంలో ఖర్చు చేశాయని పొలిటికల్ వర్గాల టాక్. 2019 ఎన్నికల్లో ఓటమిపాలైనా మంగళగిరికే పరిమితమై ప్రజల సమస్యలు తెలుసుకుని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం లోకేశ్ కు వరమైంది.
 
అదే సమయంలో కూటమి అధికారంలోకి వస్తే మాత్రమే అమరావతి రాజధానిగా కొనసాగడంతో పాటు తమ ప్రాంతంలో మరింత ఎక్కువగా అభివృద్ధి జరుగుతుందని మంగళగిరి వాసులు ఫీలవుతున్నారు. మంగళగిరి నుంచి పోటీ చేయడం లావణ్యకు మైనస్ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. లావణ్య కుటుంబానికి పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉన్నా ఆమెకు రాజకీయ అనుభవం లేకపోవడం మైనస్ అయింది.
 
మంగళగిరిలో ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలనే లోకేశ్ కల ఈ ఎన్నికల్లో సులువుగానే నెరవేరనుందని తెలుస్తోంది. వైసీపీ కనీసం ఆరు నెలల ముందే లావణ్యను అభ్యర్థిగా ప్రకటించి ఉంటే బాగుండేదని ఆలస్యంగా అభ్యర్థిని ప్రకటించి వైసీపీ తప్పు మీద తప్పు చేసిందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. లోకేశ్ ఎమ్మెల్యేగా గెలిస్తే రాజకీయాల్లో శరవేగంగా అంచలంచెలుగా ఎదుగుతాడని టీడీపీ నేతలు ఫీలవుతున్నారు. మంగళగిరిలో ఈ ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగురుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: