జ‌గ‌న్‌ను వ‌దులుకుని నిండా మునిగిపోయిన జంగా.. అయ్య‌య్యో పాపం..?

RAMAKRISHNA S.S.
యాద‌వ సామాజిక వ‌ర్గానికి చెందిన జంగా కృష్ణ మూర్తి రాజ‌కీయాల్లో పెద్ద కుదుపు తెర‌మీదికి వ‌చ్చింది. ప్ర‌స్తుతంఆమె వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు. అయితే.. ఎన్నిక‌ల‌కు ముందు.. పార్టీమార‌డంతో పాటు.. టీడీ పీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రించారు. అంతేకాదు.. వైసీపీపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఈ ప‌రిణామాల‌ను వైసీపీ సీరియ‌స్‌గా తీసుకుంది. ఈ క్ర‌మంలోనే వైసీపీ ఇచ్చిన ఎమ్మెల్సీ ప‌ద‌వి నుంచి ఆయ‌న‌ను అన‌ర్హుడిగా ప్ర‌క‌టించారు. దీంతో ఉన్న ప‌ద‌వికూడా పోయింది.

దీంతో ఇప్పుడు జంగా భ‌విత‌వ్యం ఏంటి? అనేదిఆస‌క్తిగామారింది. ఆయ‌న వైసీపీలో ఉండి ఉంటే.. ఈ ద‌ఫా పార్టీ అధికారంలోకివ‌చ్చి ఉంటే..ఆయ‌న‌ను తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం బోర్డు చైర్మ‌న్ చేయాల‌ని సీఎం జ‌గ‌న్ భావించిన‌ట్టు జంగా వ‌ర్గ‌మే ఆరు మాసాల కింద‌ట చెప్పింది. సో.. అది వైసీపీ వ‌స్తే.. సాకారం అయ్యేది. అదిజ‌ర‌గ‌లేదు. ఇక‌, వైసీపీలోనే ఉండి ఉంటే.. ఎమ్మెల్సీ స్థాన‌మైనా ద‌క్కి ఉండేది. అది కూడా పోయింది.

ఇక‌, ఇప్పుడు పూర్తిగా జంగా రాజకీయ జీవితం.. టీడీపీపైనే ఆధార‌ప‌డి ఉంది. ఈ పార్టీలోనే ఆయ‌న‌కు గుర్తింపు వ‌స్తే రావాలి. లేక‌పోతే.. మ‌రో మూడేళ్ల పాటు ఆయ‌న మౌనంగా ఉండాల్సిందే. ప‌ద‌వులు ద‌క్కించుకునే అవ‌కాశం ఇప్ప‌ట్లో క‌నిపించ‌డం లేదు.పైగా.. గుర‌జాల‌లో య‌ర‌ప‌తినేని శ్రీనివాస‌రావు గెలిస్తేనే టీడీపీ అధికారంలోకి వ‌చ్చినా.. జంగాకు గుర్తింపు ద‌క్కుతుంది. లేక‌పోతే.. అది కూడా ద‌క్కే ప‌రిస్థితి లేదు. అంటే.. మొత్తానికి త‌నే స్వ‌యంగాగేట్లు వేసుకున్నారు.

కేవ‌లం ఎమ్మెల్సీ సీటు కోసం.. జంగా ఆశించారు. దీనిని ఇస్తామ‌ని టీడీపీ కూడా చెప్పింది. వాస్త‌వానికి ఆదిలో ఆయ‌న‌పేరే గుర‌జాల నుంచి వినిపించింది. త‌ర్వాత‌.. వేరే నియోజ‌క‌వ‌ర్గం నుంచి కూడా ప‌రిశీలించారు. దీంతోవైసీపీ నుంచి వ‌చ్చేశారు. కానీ, ఎన్నిక‌ల స‌మ‌యంలోజంగా గ్రాఫ్‌బాగాలేద‌ని.. వైసీపీ చెప్పిన మాటే టీడీపీ నుంచి కూడా వినిపించింది. క‌ట్ చేస్తే.. వైసీపీలో ఉన్న‌ప్పుడు ఉన్న ప‌ద‌వి కూడా ఇప్పుడులేదు.

మ‌రి టీడీపీ కూట‌మి అధికారంలోకి వ‌చ్చినా.. ఇప్ప‌టికే ఈజిల్లాకు చెందిన ఇద్ద‌రికి చంద్ర‌బాబు ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. వీరిలోతెనాలి మాజీ ఎమ్మెల్యే రాజేంద్ర‌ప్ర‌సాద్‌, పెద్దకూర‌పాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మాల‌పాటి శ్రీధ‌ర్ ఉన్నారు. వీరితోపాటు.. డొక్కా మాణిక్య వ‌ర‌ప్ర‌సాద్‌కూడా.. ఉన్నారు. వీరిని కాద‌ని.. జంగాకు ఛాన్స్‌ద‌క్క‌డం అసాధ్యం. సో.. ఎలా చూసుకున్నా.. జంగావేసిన స్టెప్‌.. రాంగ్ అని ఆయ‌న వ‌ర్గ‌మే చెబుతుండ‌డం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: