సీఎం రేవంత్ కు ఆగస్టు సంక్షోభం తప్పదా..?

Pandrala Sravanthi
గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు చాలా డిఫరెంట్ గా మారుతున్నాయి.   బిజెపి, బీఆర్ఎస్ నేతలు త్వరలో ప్రభుత్వం మారబోతోందని సీఎం రేవంత్ పదవి పోతోందని  వ్యాఖ్యలు చేస్తున్నారు. జూన్ 4 తర్వాత తెలంగాణలో మార్పు జరగబోతుందని అంటున్నారు. ఈ మాటల వెనుక ఉన్న అర్థం ఏంటి. అసలు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందా.? కూలుతుందా అనేది ప్రస్తుతం ప్రజల్లో నడుస్తున్న చర్చ. ఆ వివరాలు ఏంటో చూద్దాం. తెలంగాణ రాజకీయాల్లో  మొదటిసారి ఆగస్టు సంక్షోభం రాబోతోందని  ప్రత్యర్థి పార్టీలు చెబుతున్నాయి. దీనికి జూన్ 4వ తేదీన ముహూర్తం ఫిక్స్ అవ్వబోతోందని లోక్సభ ఎన్నికల ఫలితాలను బట్టి ఈ సంక్షోభం ఉంటుందా ఉండదా అనేది తెలుస్తుంది. 

ఒకవేళ లోక్ సభ ఎన్నికల్లో బిజెపికి డబల్ డిజిట్ సీట్లు వస్తే మాత్రం  బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి పూర్తిస్థాయిగా వలసలు పెరిగిపోతాయి. రిజల్ట్ తర్వాత బిజెపికి పూర్తిస్థాయిలో మెజారిటీ వస్తే మాత్రం తప్పకుండా ఆగస్టు సంక్షోభం వస్తుందని తెలంగాణ  సీనియర్ బిజెపి నేతలు పదే పదే మాట్లాడుతున్నారు.  కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో పెరిగే వ్యతిరేకత, బిజెపి తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం  చేస్తోంది. ఈ తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి పాతిక మంది ఎమ్మెల్యేలు మా పార్టీలో చేరబోతున్నారని స్టేట్మెంట్లు ఇస్తున్న తరుణంలో,  బిజెపి మాత్రం డబల్ డిజిట్ సాధిస్తే  తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేసి, బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మరికొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కలుపుకొని ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని చెప్పకనే చెబుతున్నారు.

 మార్పులన్నీ ఆగస్టులోనే జరగబోతున్నాయని, ఇది జరగాలి  అంటే తప్పనిసరిగా తెలంగాణలో డబుల్ డిజిట్ ఎంపీ సీట్లు బిజెపికి రావాలి. బిజెపి బలం తెలంగాణలో పుంజుకుంటే  బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పూర్తిగా తమ పార్టీలోకి లాగి, అలాగే కాంగ్రెస్ నుంచి కూడా కొంతమంది ఎమ్మెల్యేలు లాగి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని పెద్ద ప్లాన్ తో బీజేపీ ఉన్నది. ఈ క్రమంలోనే   కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సాధిస్తే మాత్రం  ఇక బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఇక్కడ విఫలమైనట్టే. బిజెపి ఎప్పటిలాగే ప్రతిపక్ష హోదాలో ఉంటుంది. ఈ విధంగా బిజెపి పార్టీ చాన్స్ దొరికితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్లాన్ తోనే ఉన్నట్టు సమాచారం అందుతోంది. అందుకే ఆగస్టులో రేవంత్ సర్కారుకు సంక్షోభం ఏర్పడబోతోందని గత కొన్ని రోజులుగా  రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ చర్చ చిక్కుముడి వీడాలంటే జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: