అశ్విన్ బాబు శివం భజే ఫస్ట్ లుక్ అదుర్స్.. ఈ హీరో బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తారా?

Reddy P Rajasekhar
అశ్విన్ బాబు హీరోగా గంగా ఎంటర్టైన్మంట్స్ మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మాణంలో తెరకెక్కుతున్న శివం భజే సినిమాపై ఒకింత భారీ స్థాయిలోనే అంచనాలు ఏర్పడ్డాయనే సంగతి తెలిసిందే. అప్సర్ ఈ సినిమాకు డైరెక్టర్ కాగా శివం భజే టైటిల్ కొత్తగా ఉండటంతో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా అశ్విన్ బాబు శివం భజే ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా ఈ సినిమాతో అశ్విన్ ఏ రేంజ్ హిట్ అందుకుంటారో చూడాలి.
 
ఫస్ట్ లుక్ లో ఒంటి కాలి మీద నిలబడి ఒంటిచేత్తో మనిషిని ఎత్తేసి రౌద్ర రూపంలో అశ్విన్ కనపడుతున్న పోస్టర్ అదుర్స్ అని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. ఘోరాలు, త్రిశూలాలు, చీకట్లో కాగడాలు, ఆ వెనక దేవుడి విగ్రహం చూస్తుంటే ఈ పోస్టర్ అఖండ మూవీని గుర్తు చేస్తోందని సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. దిగంగనా సూర్యవంశీ కథానాయికగా ఈ సినిమాలో నటిస్తున్నారు.
 
అర్బాజ్ ఖాన్, హైపర్ ఆది, సాయి ధీన, మురళీ శర్మ, బ్రహ్మాజీ, తులసి ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా న్యూ ఏజ్ సినిమా అని అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ మూవీ మెప్పిస్తుందని మేకర్స్ నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టవల్-24 'బెస్ట్ సినిమాటోగ్రఫీ' అవార్డు గ్రహీత దాశరథి శివేంద్ర ఈ సినిమా కోసం పని చేయడంతో అంచనాలు మరింత పెరిగాయి.
 
ఈ మధ్య కాలంలో కొత్త తరహా సినిమాలకు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుండగా శివం భజే కూడా ఆ జాబితాలో చేరుతుందేమో చూడాల్సి ఉంది. ఛోటా కె ప్రసాద్ ఈ సినిమాకు ఎడిటర్ గా పని చేస్తున్నారు. భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందేమో చూడాల్సి ఉంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: