వెంకటేష్, మంచు మనోజ్ కాంబినేషన్ లో మూవీ సెట్ చేసిన స్టార్ డైరెక్టర్..!?

Anilkumar
టాలీవుడ్ సీనియర్ హీరోల్లో ఒకరైన విక్టరీ వెంకటేష్ ఇప్పటికీ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన చేస్తున్న తన నెక్స్ట్ సినిమాలో ఒక టాలీవుడ్ స్టార్ హీరో కీలక పాత్ర కోసం తీసుకున్నారు అన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ విషయం ఏంటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.. టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ఈ ఏడాది సంక్రాంతికి సైంధవ్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఊహించిన స్థాయిలో విజయాన్ని

 అందుకోలేకపోయింది. దీంతో తన తదుపరి సినిమా పై ఫుల్ ఫోకస్ పెట్టాడు వెంకటేష్. ఇందులో భాగంగానే తనకు ఇచ్చిన దర్శకుడితో మరొకసారి సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎఫ్2 ఎఫ్3 వంటి సినిమాలతో వెంకటేష్ కి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించిన దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ ఇప్పుడు తన తదుపరి సినిమాని చేస్తున్నాడు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అంతేకాదు కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రాబోతున్నట్లుగా సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన

 అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే సెట్స్ పైకి కూడా వెళ్లబోతుందట. ఇదిలా ఉంటే ఇక ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చే సినిమాలో గతంలో వరుణ్ తేజ్ సైతం నటించాడు. ఎఫ్ టు ఎఫ్ త్రీ సినిమాల్లో వెంకటేష్ వరుణ్ తేజ్ కలిసి నటించి మంచి విజయాన్ని అందుకున్నాడు. అయితే ఇప్పుడు ఆయన స్థానంలో మంచు మనోజ్ నటించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ఆయన ఎలాంటి  పాత్రలో నటిస్తారు అన్నదానిపై క్లారిటీ లేదు. త్వరలోనే దేనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా చేస్తారట. ఇకపోతే మంచు మనోజ్ ప్రస్తుతం తేజ సజ్జ హీరోగా నటిస్తున్న మిరాయ్ అనే సినిమాలో విలన్ గా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా అయిపోయిన తర్వాత వెంకటేశ్ సినిమాలో జాయిన్ అవ్వనున్నట్లు గా తెలుస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: