ప్రభాస్ కల్కి సినిమాకి హైలైట్ గా దీపిక యాక్షన్..!?

Anilkumar
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన లేటెస్ట్ సినిమా కల్కి. ఈ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించడానికి రెడీగా ఉంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన డబ్బింగ్ పనులను పూర్తి చేసుకుంది ఈ బ్యూటీ. మొదటిసారిగా ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమాతో టాలీవుడ్ కి గ్రాండ్గా ఎంట్రీ ఇస్తోంది. దీంతో టాలీవుడ్ సినీ అభిమానులు అందరూ దీపికకు గ్రాండ్గా వెల్కమ్ చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం బాలీవుడ్ ని ఇండస్ట్రీలో నంబర్ వన్ హీరోయిన్ గా  పేరు తెచ్చుకుంది దీపికా

 పదుకొనే. వరుసగా ప్రస్తుతం కమర్షియల్ బ్లాక్ బస్టర్ సినిమాలతో ఇండియన్ బాక్స్ ఆఫీస్  షేక్ చేస్తోంది. అయితే ఆమెకి ఇంతటి స్టార్ డం వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా సౌత్ సినీ ఇండస్ట్రీలో సినిమా చేయలేదు. దీంతో ఇప్పుడు కల్కి సినిమాతో దక్షిణాది ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధంగా ఉంది. ఇకపోతే ఇండియన్ సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా గ్లోబల్ కాన్సెప్ట్ తో ఈ సినిమా రావడంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా వైజయంతి మూవీస్ బ్యానర్  తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా ఇంత పెద్ద స్థాయిలో రావడంతో కథ వినగానే వెంటనే

  చేయడానికి ఓకే చెప్పేసింది దీపికా పదుకొనే. అయితే ఇప్పటికే దీపికా హాలీవుడ్లో నటించి అక్కడ కూడా భారీ గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఇప్పుడు కల్కి సినిమాతో గ్లోబల్ స్థాయిలో ఇమేజ్ తెచ్చుకుంటారా అన్నది చూడాల్సి ఉంది. అయితే ఇప్పటికే దీపికా ఎన్నో యాక్షన్  సినిమాల్లో నటించింది. ఆ అనుభవం తనకి ఉండడంతో ఈ సినిమాకి అది ఇంకా బాగా హెల్ప్ అవుతుంది అని అందరూ నమ్ముతున్నారు. కాగా ప్రభాస్ దీపిక కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా 27 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ దీపిక తో పాటు లోకనాయకుడు కమలహాసన్ బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ సైతం నటిస్తున్నారు. అలాగే దిశా పటాని సైతం ఒక కీలక పాత్రలో కనిపించబోతోంది. తాజాగా సినిమా నుండి బుజ్జి నీ కూడా పరిచయం చేశాడు చిత్రబృందం..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: