తొలి మూడు విడతల్లో బీజేపీకి బిగ్‌ లాస్‌ తప్పదా?

Chakravarthi Kalyan
దేశ సార్వత్రిక ఎన్నికల్లో గెలిచేదెవరు? కేంద్రంలో అధికారంలోకి వచ్చేది ఎవరు? ఇప్పటికే మూడు విడతల్లో సగానికి పైగా లోక్ సభ సీట్లలో ఎన్నికలు పూర్తయ్యాయి. సోమవారం నాలుగో విడత సిద్ధంగా ఉంది. ఈ మూడు విడదల్లో ఎవరిది ఆధిపత్యం అనే దానిపైనే ప్రస్తుతం చర్చంతా నడుస్తోంది. పైగా ఈ మూడు దశల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదు కావడంతో ఎవరి లెక్కల్లో వారు ఉన్నారు.
 
ఈ మూడు విడతల్లో ఎదురు దెబ్బ తగిలింది అని ఇండియా కూటమి ఆరోపిస్తుంటే.. లేదు ఇండియా కూటమికి గతంలో వచ్చిన సీట్లు కూడా రావని బీజేపీ చెబుతోంది. వాస్తవానికి కేంద్రంలో అధికారంలోకి రావాలంటే ఈ మూడు విడతలే కీలకం అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ సమయంలో ఎన్నికలు జరిగిన రాష్ట్రాలు చూసుకుంటే కర్ణాటక, కేరళ, తమిళనాడు లో ఇండియా కూటమి ఎక్కువ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.

ఇదే సమయంలో గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, అసోం, ఉత్తరాఖండ్, యూపీలో బీజేపీ బలంగా ఉంది.  ఈ రాష్ట్రాల్లో 127 స్థానాలు ఉన్నాయి. వీటిలో వందకు పైగా సీట్లు గెలుచుకోగలమని ఎన్డీయే కూటమి భావిస్తోంది. అలాగే తమిళనాడులో కూడా 5 నుంచి 10 సీట్లు, కర్ణాటకలో గతంతో పోల్చితే తగ్గినా 15 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేస్తోంది.

ఇక మిగతా రాష్ట్రాల్లో ఓ పది సీట్లు వచ్చినా 130 నుంచి 140 వరకు గెలుస్తామనే లెక్కల్లో ఉంది. తర్వాత జరిగే 260 స్థానాల్లో 160 స్థానాలు గెలిచినా తాము అనుకున్న లక్ష్యం 400 సీట్లు వస్తాయని భావిస్తోంది. మొత్తంగా బీజేపీకి సొంతంగా 350 కి పైగా స్థానాలు మిత్రపక్షాలకు 50కిపైగా సీట్లు గెలుస్తామనే నమ్మకంతో ఉంది. ఒకవేళ మిగతా నాలుగు విడతల్లో ఏదైనా అనూహ్య ఫలితాలు ఎదురైనా తక్కువలో తక్కువ 270 నుంచి 300 సీట్లు సులభంగా వస్తాయని బీజేపీ నేతలు బలంగా నమ్ముతున్నారు. మరి ఎవరి లెక్కలు కరెక్ట్ అవుతాయో ఎన్నికల ఫలితాల వరకు ఎదురు చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp

సంబంధిత వార్తలు: