జగన్ ఓటమికి అది కూడా ప్రధాన కారణమే?

Purushottham Vinay
మీడియా అనేది ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిలాంటిది. ఆ మీడియాను రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు ఇంకా ఎవ్వరైనా కానీ చక్కగా వినియోగించుకుంటే మీడియా చేసేంత మేలు ఇంకోటి చెయ్యదు. ఎందుకంటే అసలు ప్రజలు ఏమి అనుకుంటున్నారు అన్న ఫీడ్ బ్యాక్ మీడియా ద్వారానే ప్రభుత్వానికి నేరుగా తెలుస్తుంది.మీడియా అనేది ఇంటికి కిటికీ లాంటిది. ఇంటి తలుపులు మూసుకుని కిటికీలు తెరకుండా గదిలో చీకటిలో ఉంటే ఏమి అర్ధం అవుతుంది. అంతా బాగుంది కదా అనుకొని కళ్ళకు గంతలు కట్టుకుని ఉన్నట్లు అవుతుంది. అదే వైసీపీ ఘోర పరాజయం వెనక బలమైన కారణమని కూడా తెలుస్తుంది.జగన్ విషయం చూస్తే ఆయన మీడియాకు దూరంగా ఉంటారు. మొదటి నుంచి ఎందుకో ఆయన తత్వం అంతా అని అనుకున్నా పార్టీ నేతగా ఉన్నపుడు వేరు కానీ కోట్లాది మంది ప్రజలకు బాధ్యుడిగా కీలకమైన పదవిలో ఉన్న వారికి మీడియాతో మంచి సంబంధాలనేవి ఖచ్చితంగా ఉండాలి. ఏ విషయం అయినా ప్రజలకు చెప్పాలంటే మీడియానే సరైన బేస్.అలాంటి మీడియాను జగన్ దూరం చేసుకున్నారు. ఇంకా విచిత్రమేంటి అంటే ఆయన స్వయంగా ఓ ప్రముఖ మీడియా అధిపతి. సొంత పేపర్ ఇంకా చానల్ ఉన్న జగన్ చక్కగా ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టుకొని జనాలకు దగ్గర కావొచ్చు.


గత అయిదేళ్ళలో జగన్ మోహన్ రెడ్డి ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు అన్నది వాస్తవం.ప్రభుత్వ అధినేతగా జగన్ తాను చేసిన మంచి పనులను చెప్పుకునేందుకు కూడా మీడియాను సరిగ్గా ఉపయోగించుకోలేదు. ఎందుకంటే మీడియా ముఖంగా అయితే జనాలకు చేరాల్సిన విషయం చేరుతుంది. మరి ముఖ్యమంత్రి మీడియాను అడ్రస్ చేయకపోతే ఎవరు చేస్తారు, ప్రభుత్వం గురించి పాజిటివ్ గా ఎవరు చెబుతారన్నది ఇక్కడ ప్రశ్న.పై స్థాయిలో కనుక జగన్ చెబితే దిగువ స్థాయిలో క్యాడర్ కూడా చెబుతారు. మరి జగన్ చెప్పక క్యాడర్ కూడా చెప్పక పరిస్థితి ఇలా దారుణంగా ఉంటుంది. అసలు పాలనలో భాగం కానీ ఎన్నడూ ఎక్కడా లేని ఒక కొత్త వ్యవస్థ వాలంటీర్లను జగన్ తీసుకుని వచ్చారు.


 5 సంవత్సరాలు వారి మీదనే జగన్ పూర్తిగా ఆధారపడి పోయారు.కానీ జీతానికి పనిచేసే వాలంటీర్లకు ప్రభుత్వం చేసే మంచి గురించి చెప్పాల్సిన అవసరమేమి ఉంటుందన్నదే కీలకమైన ప్రశ్న. పోనీ వారికేమైనా జీతాలేమన్నా చక్కగా ఇచ్చారా అంటే అది కూడా లేదు. అలాంటప్పుడు వాళ్ళు ఎందుకు జగన్ మంచి పనులని చెప్పుకుంటారు. ముఖ్యమంత్రిగా జగన్ కనీసం నెలలో ఒకసారి అయినా మీడియాను పిలిచి ప్రభుత్వం ఏమి చేస్తుందో ఎలా పనిచేస్తుందో ఏ కార్యక్రమాలను తీసుకుంటుందో చెబితే అది కొంతలో కొంత అయిన జనాలకు వెళ్తుంది. కానీ అలా చెయ్యలేదు. ఫలితంగా చాలా దారుణంగా ఓడిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: