వైసీపీ: ఏపీ ఎన్నికలపై అనుమానాలు.. ఈవీఎంలే మార్చేశారా?

Veldandi Saikiran

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికలు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. మంగళవారం రోజున.. ఎవరు ఊహించని ఫలితాలు ఏపీ ప్రజలు ఇచ్చారు. 151 స్థానాలు గత ఎన్నికల్లో గెలుచుకున్న వైసీపీ పార్టీ.... ఈసారి మాత్రం  అత్యంత దారుణంగా ఓడిపోయింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీకి కేవలం 11 స్థానాలే వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి అలాగే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి కీలక నేతలు మాత్రమే  వైసీపీలో గెలిచారు.
మరో 9 మంది వైసీపీ ఎమ్మెల్యేలు పెద్దగా ఎవరికి తెలియని పరిస్థితి నెలకొంది. అయితే తెలుగుదేశం పార్టీకి 135 స్థానాలు రావడం, జనసేన పార్టీ 21 స్థానాలకు 21 కొట్టడం...  ఇటు 0.1% ఓట్ శాతం ఉన్న బిజెపి పార్టీ ఏపీలో 8 ఎమ్మెల్యేలను గెలుచుకోవడం పట్ల...  వైసిపి నేతలు అలాగే వైసీపీ సానుభూతిపరులు  సంచలన ఆరోపణలు చేస్తున్నారు. అలాగే ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై పలు అనుమానాలను కూడా వ్యక్తపరుస్తున్నారు. ఏపీ ఎన్నికల్లో పెద్ద గ్యాంబ్లింగ్ జరిగిందని వైసిపి నేతలు కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు.
 ఈవీఎంలను కూడా మార్చేశారని కొంతమంది యూట్యూబ్ ఛానల్ లో చెబుతున్నారు. అసలు గ్లాస్ గుర్తు అంటే తెలియని ఓటర్లు, ముఖ్యంగా ముసలి వాళ్లు... జనసేనకు ఎలా ఓటు వేశారని వైసీపీ సానుభూతిపరులు ప్రశ్నిస్తున్నారు.  అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేతలకు దిక్కులేని బిజెపి పార్టీకి.. 8 స్థానాలు రావడం ఏంటని నిలదీస్తున్నారు. చంద్రబాబు,  పవన్ కళ్యాణ్ ఇద్దరూ మోడీతో కుమ్మక్కై... ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి ఉంటారని పలు సంచలన ఆరోపణలు చేస్తున్నారు.
 ధర్మవరంలో కేతిరెడ్డి లాంటి  కచ్చితంగా గెలువాల్సిన... వైసీపీ నేతపై బిజెపి నాయకులు సత్యకుమార్ ఎలా గెలుస్తారని  ఫైర్ అవుతున్నారు. ధర్మవరం నియోజకవర్గంలో కేతిరెడ్డికి మంచి పేరు ఉందని... అలాంటి నేతను కాదని బిజెపికి వెళ్లి ఓటు వేసేవారు ఉన్నారా? అని అంటున్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద స్కాం జరిగిందని... ఇందుకే వైసీపీకి దారుణమైన ఓటమి ఎదురైందని అంటున్నారు. అధికారులను, ఎన్నికల సంఘాన్ని  గుప్పిట్లో పెట్టుకుని తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిందని వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఓడిపోయాక ఎవరైనా ఇలాగే చెబుతారని రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయాలను వెల్లుబుచ్చుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: