కొత్త అనుభూతితో వావ్ అనిపించేలా కల్కి రొమాంటిక్ సాంగ్?

Purushottham Vinay
రెబల్ స్టార్ ప్రభాస్, దీపికా పదుకొనె ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ "కల్కి 2898 ఏడి". ప్రమోషన్స్ తోనే ఈ సినిమా బాహుబలి రేంజ్ లో మంచి హైప్ క్రియేట్ చేస్తోంది.ఈ సినిమా నిర్మాత అశ్వినీ దత్ ఇప్పటికే పొలిటికల్ మ్యాటర్ తో మూవీ పై మంచి హైప్ క్రియేట్ చేశారు. ఇక మూవీ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ కూడా అంచనాలను మరింత పెంచేస్తుంది. ఇప్పటికే బుజ్జి అండ్ భైరవ యానిమేషన్ వెబ్ సీరీస్ కు కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.ఇక విడుదలైన టీజర్లు కూడా అదిరిపోయాయి. ఇక సాంగ్స్ తో కూడా మరింత ఇంపాక్ట్ క్రియేట్ చేయాల్సిన పని ఉంది. సంతోష్ నారాయణన్ ఈ మూవీకి మ్యూజిక్ అందించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో సాంగ్స్ మాత్రమే కాకుండా వాటి మేకింగ్ కొరియోగ్రఫీ కూడా చాలా కొత్తగా ఉంటుందని తెలుస్తోంది. అండర్‌వాటర్ లో ఇప్పటివరకు థ్రిల్లింగ్ సీన్స్ యాక్షన్ సీన్స్ చూసి ఉంటారు. దర్శకుడు నాగ్ అశ్విన్ సూపర్ ప్లాన్ తో సాంగ్ ను డిజైన్ చేసినట్లుగా తెలుస్తోంది.త్వరలోనే ఆ రొమాంటిక్ సాంగ్ విడుదలకు రెడీ అవుతుంది.


ఈ పాటను యూరప్‌లో షూట్ చేశారు. అభిమానులు ఈ పాట విడుదల కోసం ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఈ సాంగ్ విడుదల కానుందని సమాచారం. ఈ సాంగ్‌లో సముద్రం లోతుల్లో తీసిన సీన్స్ ఉండనున్నాయి. అండర్‌వాటర్ ప్రపంచ అందాలను చూపిస్తూ ఈ పాట దృశ్యపరంగా చాలా అద్భుతంగా ఉండబోతోందని సమాచారం తెలుస్తోంది.గతంలో దిశా పటానీ విదేశీ లొకేషన్ నుంచి కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు అదే పాటకు సంబంధించినవా లేదా అనేది తెలియదు కానీ, అభిమానులు ఫైనల్ అవుట్‌పుట్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. "బుజ్జి & భైరవ" యానిమేటెడ్ వెబ్ సిరీస్ చూసిన తర్వాత వారి అంచనాలు ఇంకా పెరిగాయి. దిశా పటానీ గ్లామర్ కూడా ఈ పాటలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని సమాచారం తెలుస్తుంది."కల్కి 2898 ఏడి"లో ప్రభాస్ తో పాటు దీపికా పదుకొనె, అమితాబ్ బచ్చన్ ఇంకా కమల్ హాసన్ వంటి ప్రతిభావంతుల నటీనటులు ఉన్నారు. ఈ మూవీ ప్రస్తుతం ప్రమోషనల్ దశలో ఉంది. ట్రైలర్ విడుదలైన తర్వాత ఈ అండర్‌వాటర్ రొమాంటిక్ సాంగ్ కూడా విడుదల అవుతుందని సమాచారం తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: