సూపర్ టాలెంటెడ్ యాక్టర్ నవదీప్ సరికొత్త అవతార్‌లో నవదీప్ 2.Oగా కనిపించబోతున్న చిత్రం 'లవ్,మౌళి'.ఈ విభిన్నమైన, వైవిధ్యమైన చిత్రానికి ఎస్.ఎస్. రాజమౌళి శిష్యుడు అవనీంద్ర దర్శకుడు. ఇప్పటికే ఈ సినిమా ప్రచార చిత్రాలు, ప్రమోషన్ కంటెంట్ సినిమాపై ఆసక్తిని పెంచగా… నైరా క్రియేషన్స్ మరియు శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్‌తో కలిసి టాలీవుడ్ టాలెంటెడ్ టెక్నిషియన్స్‌కి అడ్డాగా మారిన సి స్పేస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇటీవల సింగిల్ కట్ లేకుండా సెన్సారును పూర్తిచేసుకున్న ఈ చిత్రం సెన్సార్ నుండి 'ఏ' సర్టిఫికెట్‌ను సొంతం చేసుకుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూన్ 7న గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమైన ఈ చిత్ర విశేషాలను దర్శకుడు అవనీంద్ర మీడియాతో పంచుకున్నారు.ఈ కథ అనుకున్నప్పుడు నేను 'ఆర్ఆర్ఆర్' రైటింగ్‌లో ఉన్నాను. నేను ఆ సినిమాకు అసోసియేట్ రైటర్‌ని. అప్పుడే మా టీమ్ అంతా నువ్వు డైరెక్ట్ చేసే సమయం ఆసన్నమైందంటూ ప్రోత్సహించారు. అయితే నేను కమర్షియల్ కథలు ఎన్నో అప్పటికే రాసేశాను. ఏ కథ రాస్తే బాగుంటుందా? అని ఆలోచిస్తూ కొత్తగా ఏదైనా ప్రేక్షకులకు రిఫ్రెష్ అనిపించేలా ఉండాలని అనుకున్నాను. ఒకవైపు ఆర్ఆర్ఆర్ రాస్తున్నప్పుడే పేరలల్‌గా ఈ పాయింట్ అనుకున్నాను. ఆర్ఆర్ఆర్‌తో అప్పటికే ఓకే చేసిన కథలన్నీ పూర్తి చేసి ఈ కథపై కూర్చున్నా. మనం కథ రాస్తున్నప్పుడు మనం ఎవరినో ఒకరిని ఊహించుకుంటూ రాయాలి. ఈ కథకి అలా ఊహించుకోవడం చాలా కష్టం. ఈ ఒక్క కథకి ఎవరినీ ఊహించుకోకుండా ఒక నవలలా కథ రాసేశా. ఆ తర్వాత ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోలందరినీ ఈ కథకి ఊహించుకుంటూ వచ్చా. అయితే ఆ ఫొటోలలో అప్పుడు నవదీప్ ఫొటో లేదు. అప్పుడు నవదీప్ కూడా అంత యాక్టివ్‌గా సినిమాలు చేయడం లేదు. అప్పుడు నాకెందుకో నవదీప్ అయితే అనే ఆలోచన వచ్చింది. నా ఆలోచనలన్నీ అతనిపై పెట్టి.. ఆ తర్వాత వెళ్లి కథ చెప్పా. కథ వినగానే ఎగిరి గంతేశాడు.
ఇలాంటి కథ కోసం ఎప్పటి నుండో చూస్తున్నా అని చెప్పాడు. నేను అనుకున్న లుక్‌కి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యాడు.లో దుస్తులని పబ్లిగ్గా ఆరేయడానికి సంకోచించే మైండ్ మనది. నాకున్న స్క్రీన్‌ప్లే టైమ్‌ని దృష్టిలో పెట్టుకుని.. హీరో క్యారెక్టర్ ఇదని చెప్పడం కోసమే.. హీరో ఇన్నర్ దుస్తుల్లో మందు తాగడం చూపించడం జరిగింది. ఇందులో హీరోకి ఎటువంటి సెన్సిబిలిటీస్ ఉండవు. నిజంగా అలాంటి సీన్ డిస్టర్బ్‌గా అనిపిస్తే సెన్సార్ వాళ్లు చూసుకుంటారు. వైజాగ్‌లో షోకి 50 శాతం అమ్మాయిలే వచ్చారు. ఎవరూ ఒక్కరు కూడా ప్రశ్నించలేదు. పోస్టర్‌లో అలా అనిపిస్తుంది కానీ.. సినిమా చూశాక అందరికీ ఆ సీన్ అర్థమవుతుంది.సెన్సార్ వాళ్లు యుబైఏ సర్టిఫికెట్ ఇస్తా అన్నారు కానీ 20 కట్స్ చెప్పారు. కానీ ఆ కట్స్ వల్ల కథ ఫ్లో పోతుంది. కథ కథగా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి అంటే.. అయితే 'ఏ' ఇస్తాం అన్నారు. నేను ముందుగానే 'ఏ'కి ప్రిపేరై ఉన్నా. 'ఏ' కావాలని మాత్రం అడగలేదు.. ప్రిపేర్ అయి ఉన్నా. 18ప్లస్‌కి అవసరమైన కథ ఇది.నెక్ట్స్ ఆర్ఆర్ఆర్ లాంటి సినిమా చేయడానికి ప్రయత్నిస్తా. ఆర్ఆర్ఆర్ సినిమాకు సీక్వెల్ చేసే స్కోప్ ఉంది. కథకి అయితే స్కోప్ ఉంది. చేస్తారా? చేయరా? అనేది రాజమౌళిగారి నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. ఆర్ఆర్ఆర్ చేసేటప్పుడే తర్వాత సినిమా మహేష్ బాబుతో అని తెలుసు. మహేష్ బాబు కోసం ఎటువంటి సినిమా చేయాలా? అని అందరినీ అడిగారు. అడ్వంచర్ సినిమా చేయాలని టీమ్ అంతా అనుకున్నాక.. స్టోరీ ప్రారంభమైంది. అంత వరకే చెప్పగలను.