యానిమల్ పార్క్ లోకి కబీర్ సింగ్.. బాక్స్ ఆఫీస్ బద్దలే?

Purushottham Vinay
సందీప్ రెడ్డి వంగ ఇప్పటి దాకా చేసింది కేవలం మూడే మూడు సినిమాలు అయినా స్టార్ హీరోల రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్నారు. తోప్ డైరెక్టర్ గా తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ దక్కించుకున్నారు.విజయ్ దేవరకొండతో చేసిన తన ఫస్ట్ మూవీ అర్జున్ రెడ్డితో బ్లాక్ బస్టర్ హిట్ సాధించారు సందీప్. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టిన ఈ మూవీ.. పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ తర్వాత అదే సినిమాను బాలీవుడ్ లో స్టార్ హీరో షాహిద్ కపూర్ హీరోగా కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి మరో ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఆ మూవీతో బీ టౌన్ సినీ ప్రియులును ఓ రేంజ్ లో మెప్పించారు. ఇక గత ఏడాది యానిమల్ మూవీ తెరకెక్కించి మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు.బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, హాట్ బ్యూటీ రష్మిక మందన్నా నటించిన ఆ సినిమా.. పాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి భారీ వసూళ్లు సాధించింది. ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నా.. అంతకు మించి ప్రశంసలు కూడా అందుకుంది. అయితే ఈ సినిమాలో ఇంటర్వెల్ తర్వాత వచ్చే రణబీర్ ఆస్పత్రి పాలైన సీన్ సినిమాకే హైలెట్. గన్ షూట్ కు బాగా గురి కావడంతో హీరో ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ లో చేరాల్సి వస్తుంది.అయితే ఆస్పత్రిలో రణబీర్ కు చికిత్స చేసే డాక్టర్ రోల్ కోసం కబీర్ సింగ్ రోల్ ని పెడదాం అనుకున్నాడు. అందుకు సందీప్ వంగా.. కబీర్ సింగ్ క్యారెక్టర్ చేసిన షాహిద్ కపూర్ ను సంప్రదించడం జరిగిందట.


రణబీర్, షాహిద్ మధ్య అదిరిపోయే సీన్ జరిగేలా సూపర్ డైలాగులు కూడా సందీప్ రాసుకున్నారట. కానీ అంతా ఫిక్స్ అవుతున్న టైంలో.. డేట్స్ సెట్ అవ్వక షాహిద్ కపూర్ తాను యాక్ట్ చేయలేనని తప్పుకున్నాడట. దీంతో తన సూపర్ ప్లాన్ అంతా సందీప్ పక్కన పెట్టారని గుసగుసలు వినిపిస్తున్నాయి.ఇక షాహిద్ కపూర్.. ఇప్పటికే సందీప్ డైరెక్షన్ లో కబీర్ సింగ్ సినిమా చేసిన విషయం తెలిసిందే. దీంతో యానిమల్ మూవీ విషయంలో సందీప్ వేసిన ప్లాన్ వర్కౌట్ అయ్యి ఉంటే..అసలు అదిరిపోయేదని నెటిజన్లు చెబుతున్నారు. చెప్పాలంటే ఇండస్ట్రీలో ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అయిన మూవీ యూనివర్స్ లో భాగంగా తీసిన సీన్ లా బాక్స్ బద్దలు అయ్యేలా ఉండేదని అంటున్నారు. ఇప్పటికైనా మించి పోయింది లేదని.. యానిమల్ సీక్వెల్ (యానిమల్ పార్క్)లో సందీప్ ప్లాన్ వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉందని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఎలాగో యానిమల్ పెద్ద హిట్టు కావడంతో యానిమల్ పార్క్ లో కబీర్ సింగ్ క్యారెక్టర్ ని పెడితే  మాములుగా ఉండదు. సందీప్ కూడా అలా ట్రై చేద్దాం అని ఆలోచిస్తున్నట్లు గాసిప్స్ వస్తున్నాయి.మరేం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: