ఓటర్ల కోసమే ఆ యాప్... ఎన్ని ఉపయోగాలో తెలుసా..?

Pulgam Srinivas
మే 13వ తేదీన తెలంగాణతో పాటు దేశంలోని అనేక రాష్ట్రాలలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలతో పాటు మే 13 వ తేదీనే అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఎన్నికలు తేదీ దగ్గర పడింది అంటే జనాలకి అనేక అనుమానాలు వస్తూ ఉంటాయి. కొంత మందికి ఓటర్ కార్డ్ ఉన్నా కూడా అది ఎక్కడో పోవడం వల్ల మేము ఓటు ఎలా వేయాలి అనే ప్రశ్నలు వారికి వస్తూ ఉంటాయి. అలాగే మరి కొంతమందికి ఓటర్ కార్డు ఉన్నా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేది ఏ ప్రాంతంలో అనేది క్లారిటీ ఉండదు.

దానితో వారు మేము ఓటు ఎలా వినియోగించుకోవాలి అనే సందిగ్ధంలో పడుతూ ఉంటారు. ఇలాంటి సమస్యలు ఎన్నో ఎలక్షన్ లలో జనాలకు రావడంతో ఎలక్షన్ కమిషన్ ప్రజల ముందుకు ఓ అద్భుతమైన యాప్ ను తీసుకువచ్చింది. అదే "ఓటర్ హెల్ప్ లైన్" దీని ద్వారా ఓటర్లకు అనేక ఉపయోగాలు ఉన్నాయి. ఉదాహరణకు మీకు ఓటర్ ఐడి వచ్చి ఉంది. కాకపోతే అది ఎక్కడో పోయింది. దాని పూర్తి వివరాలు మీకు తెలియాలి అంటే ఒక్కసారి మీ ఫోన్ నెంబర్ కనుక అందులో కొడితే మీకు ఒక ఓటిపి వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసినట్లు అయితే మీకు మీ ఎపిక్ నెంబర్ వచ్చేస్తుంది. దాని ద్వారా మీరు మీ ఓటర్ కార్డుకు సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు. ఇక మీ దగ్గర ఓటర్ కార్డు ఉంది.

కానీ మీరు ఏ బోత్ లో మీ ఓటు హక్కును వినియోగించుకోవాలి అనేది మీకు తెలియదు అనుకుంటే అలాంటి సమయంలో కూడా ఈ యాప్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మీ ఎపిక్ నెంబర్ ను ఇందులో సెర్చ్ చేసినట్లు అయితే మీ వివరాలు తో పాటు మీ ఓటు హక్కును ఏ కేంద్రంలో వినియోగించుకోవాలి అనేది కూడా అక్కడ చూపిస్తుంది. ఇక ఈ సేవలతో పాటు ఓటు హక్కు లేకుంటే అప్లై చేసుకోవడానికి , అలాగే ఓటర్ కార్డ్ లో ఏవైనా తప్పులు ఉంటే వాటిని సరి చేసుకోవడానికి ఇలా అనేక పనులకు ఈ యాప్ ఉపయోగపడుతుంది. ఇక ఈ యాప్ ద్వారా సేవలను పొందాలి అంటే గూగుల్ ప్లే స్టోర్ కి వెళ్లి "voter helpline" అని సెర్చ్ చేసి యాప్ ను డౌన్లోడ్ చేసుకొని ఇందులోని సేవలను పొందండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: