టార్గెట్ పిన్నెల్లి : టీడీపీ రిగ్గింగ్ క‌న‌ప‌డ‌లేదా.. క‌ళ్లు మూసుకున్నారా ?

Veldandi Saikiran
మాచర్ల నియోజక వర్గం ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఎవరి మాట్లాడుతున్న మాచర్ల నియోజకవర్గం పచ్చ గురించే మాట్లాడుతున్నారు. దీని అంతటికి కారణం... మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వీడియో వైరల్ కావడం. ఎన్నికల రోజున... మాచర్ల నియోజకవర్గం లోని పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం బాక్స్లను బద్దలు కొట్టారు.
పోలింగ్ ముగిసిన 10 రోజుల తర్వాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన రచ్చకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అయితే పోలింగ్ కేంద్రం బయట జరిగిన సంఘటనలు, తెలుగుదేశం పార్టీ నేతలు చేసిన రచ్చ గురించి మాత్రం ఈ వీడియోలో కనిపించలేదని సాటి తెలుగు ప్రజలు అడుగుతున్నారు. కేవలం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీయేం బాక్స్లను బద్దలు కొట్టిన వీడియోను కట్ చేసి... తెగ వైరల్ చేస్తున్నారని తెలుగు ప్రజలు అంటున్నారు. ఇది ఏదో కావాలనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఇరికించేందుకు చేసిన పని లాగా ఉందని... చెబుతున్నారు తెలుగు రాష్ట్రాల ప్రజలు.
నిజంగానే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తప్పు చేస్తే... పోలింగ్ కేంద్రం బయట ఉన్న వీడియోలను కూడా రిలీజ్ చేయాలని అంటున్నారు. ఇదే విషయాన్ని వైసిపి అగ్ర నేతలు కూడా స్పష్టం చేస్తున్నారు. పాల్వాయి గేటు కేసులో ఒక్క వీడియోను మాత్రమే విడుదల చేశారని.. మాచర్ల నియోజకవర్గం వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ రీజినెస్ చేసిందని వైసిపి నేతలు కూడా ఆరోపణలు చేస్తున్నారు. దానికి సంబంధించిన వీడియోలను మాత్రం ఎవరు బయట పెట్టడం లేదని ఫైర్ అవుతున్నారు.
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కంచుకోట ఆయన మాచర్ల నియోజకవర్గంలో... ఎలాగైనా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయాలి... జూలకంటి బ్రహ్మారెడ్డి ప్రయత్నాలు చేశారని వైసిపి చెపుతోంది. మాచర్ల నియోజకవర్గాన్ని గెలిస్తే జగన్మోహన్ రెడ్డిని గెలిచినట్లే.. అనే ఫీలింగ్లో తెలుగుదేశం పార్టీ ఉందని... అందుకే మాచర్ల నియోజకవర్గంలో రిగ్గింగ్ చేసిందని ఫైర్ అవుతున్నారు. కానీ వాళ్ళ అరాచకలను ఆపేందుకు.. ఆగ్రహంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం బాక్స్లను బద్దలు కొట్టినట్లు అంటున్నారు. అందులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తప్పేమీ లేదని.... తెలుగుదేశం నేతలు చేసిన రచ్చనే ఎక్కువ అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: