"ఐకాన్" తీయవలసిన డైరెక్టర్ "వకీల్ సాబ్" ఎందుకు తీసాడో తెలుసా..?

MADDIBOINA AJAY KUMAR
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన వకీల్ సాబ్ మూవీ ని దిల్ రాజు నిర్మించిన విషయం మన అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా దిల్ రాజు అసలు నాకు ఎప్పటి నుండో పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలి అని ఉండేది. కానీ ఆయనకి స్టోరీ వినిపించే సోర్స్ లేక ఉండిపోయాను. ఇక వేణు శ్రీరామ్ "ఐకాన్" అనే ఒక స్టోరీని రెడీ చేశాడు. దానిని అల్లు అర్జున్ తో చేయాలి అనుకున్నాము.

అందులో భాగంగా అలా వైకుంఠపురం లో సినిమా జరుగుతున్న సమయంలో మేము అల్లు అర్జున్ ని కలవడానికి షూటింగ్ జరుగుతున్న ప్రదేశానికి వెళ్ళాము. అక్కడ త్రివిక్రమ్ గారు కూడా ఉన్నారు. అయితే అప్పటికే నేను పింక్ హిందీ వర్షన్ తమిళ్ లో అజిత్ గారు చేశారు. అది నేను చూశాను. నాకు బాగా నచ్చింది. మాటల్లో ఆ ట్రైలర్ ను నేను త్రివిక్రమ్ గారికి చూపించాను. బాగుంది సార్ అని అన్నారు. ఇది ఏ సినిమా అని అడగగా ... ఇది పింక్ కి తమిళ్ రీమేక్ అని అన్నారు.

అయితే ఏమిటి అని త్రివిక్రమ్ అన్నారు. నాకు ఈ సినిమాను పవన్ తో చేస్తే బాగుంటుంది అని ఆలోచన ఉంది సార్ అన్నారు. మీరు ఫుల్ కాన్ఫిడెన్స్ గా ఉన్నారా అని అనగారు.  ఉన్నాను అన్నాను. వెంటనే త్రివిక్రమ్ , పవన్ కి ఫోన్ చేసి ఆ సినిమా చూడండి సార్ అని చెప్పారు. సినిమా చూసిన తర్వాత ఆయనకు కూడా ఆ మూవీ నచ్చింది. కొంత మంది దర్శకులను అనుకున్నాము.

ఇక అల్లు అర్జున్ అప్పటికే అలా వైకుంటపురంలో చేస్తూ ఉండడం , ఆ తర్వాత పుష్ప కి కమిట్ అయ్యి ఉండడంతో ఐకాన్ ఇప్పట్లో కుదరదు , వేణు  నువ్వు కనక ఈ సినిమా ఆ లోపు చేస్తావా అని అడిగాను. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ తర్వాత పవన్ కి వేణు శ్రీరామ్ ను పరిచయం చేశాను. ఇద్దరి కాంబోలో సినిమా సెట్ అయింది. అలా అల్లు అర్జున్ తో ఐకాన్ చేయాల్సిన వేణు శ్రీరామ్ , పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ చేశాడు అని దిల్ రాజు తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: