నాకు ఐపిఎల్ లో నచ్చిన టీం అదే.. కాజల్..!

MADDIBOINA AJAY KUMAR
మోస్ట్ బ్యూటిఫుల్ నటీమని కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించిన సత్యభామ సినిమా మే 31 వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ బ్యూటీ వరుస టీవీ షో లలో , ఇంటర్వ్యూ లలో , పాత్రికేయ సమావేశాలలో పాల్గొంటూ అనేక విషయాలను తెలియజేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈమె ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూ లో భాగంగా ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ ఫుల్ జోష్ లో నడుస్తున్న నేపథ్యంలో తనకు ఇష్టమైన జట్టు ఏది..? అందులో తనకు ఇష్టమైన ఆటగాడు ఎవరు అనే విషయాన్ని చెప్పింది.

తాజాగా కాజల్ మాట్లాడుతూ ... నాకు ఐపిఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) అంటే ఎంతో ఇష్టం. అందులో అనేక జట్లు ఉన్నాయి. ఆ టీం  లలో నాకు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు అంటే ఎంతో ఇష్టం. ఆ జట్టు ఈ సీజన్ లో మంచి ప్రదర్శనను కనబరుస్తుంది. దాదాపుగా ఈ సారి ఫైనల్ కి వెళ్లి కప్ కూడా గెలిచే విధంగా ఉంది అని తెలియజేసింది. అలాగే సన్రైజర్స్ జట్టులో ఎంత మందో మంచి ఆటగాళ్లు ఉన్నారు. అందులో నాకు నితీష్ రెడ్డి ఆట అంటే చాలా ఇష్టం. నాకు ఆ జట్టులో అతడు ఫేవరెట్ అని చెప్పుకొచ్చింది.

ఇదిలా ఉంటే సత్యభామ మూవీ ట్రైలర్ ను మే 24 వ తేదీన విడుదల చేయనున్నారు. దానికి బాలకృష్ణ ముఖ్య అతిథిగా రానున్నాడు. ఇప్పటికే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విలువడింది. ఇక ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా భారీ ఎత్తున నిర్వహించడానికి మేకర్స్ సన్నాహాలను చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ప్రచారాలను ఫుల్ జోష్ లో ముందుకు సాగిస్తు ఈ మూవీ యూనిట్ ఈ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. మరి ఈ మూవీ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: