టార్గెట్ పిన్మెల్లి : నారా లోకేష్ ఓవ‌ర్ యాక్ష‌న్ ఎందుకు..?

Pulgam Srinivas
వైసీపీ పార్టీ మాచర్ల ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి మే 13 వ తేదీన జరిగిన పోలింగ్ రోజు తన నియోజకవర్గం లోని పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ను ధ్వంసం చేశాడు. అందుకు సంబంధించిన ఫుటేజ్ అక్కడ ఉన్న సీసీ కెమెరాలు రికార్డు అయింది. కెమెరాకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇకపోతే ఈయన అక్రమంగా పోలింగ్ బూత్ లోకి చొరబడి ఈవిఎం లను ధ్వంసం చేసిన కేసులో పలు సెక్షన్ల పై ఈయనపై కేసులు నమోదు అయ్యాయి.

దానితో పోలీసులు ఇతనిపై గాలింపు చర్యలను మొదలుపెట్టారు. కాకపోతే ఈయన జాడ ప్రస్తుతానికి పోలీసులకు దొరకడం లేదు. కానీ కచ్చితంగా ఈయనను పట్టుకోవాలి అని ఆంధ్రప్రదేశ్ పోలీసులు ముమ్మరమైన గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈయనకు సంబంధించిన వ్యక్తులపై నిగా ఉంచినట్లు , మరో కొన్ని గంటల్లోనే పట్టుకోవడానికి ఆంధ్రప్రదేశ్ పోలీస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ విషయం కాసేపు పక్కన పెడితే .... ఈయన చేసిన పనిని టీడీపీ , జనసేన , బీజేపీ నేతలు కార్యకర్తలు తప్పుపడుతూ ఈయనపై అనేక విమర్శలను చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా టీడీపీ పార్టీలో అత్యంత కీలక నేతల్లో ఒకరు అయినటువంటి నారా లోకేష్ కూడా తాజాగా పిన్నెల్లి చర్యను తప్పుపడుతూ తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశాడు.

అందులో సొంత బాబాయ్‌ని , ఓటేసి గెలిపించిన ప్ర‌జ‌ల్ని , చివ‌రికి ప్ర‌జాస్వామ్యాన్నీ ఖూనీ చేశాడు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంని వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి ramakrishna REDDY' target='_blank' title='రామ‌కృష్ణారెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">రామ‌కృష్ణారెడ్డి ధ్వంసం చేశాడు. ఓట‌మి భ‌యంతో ఈవీఎంల ధ్వంసంతో పాటు దాడుల‌కి తెగ‌బ‌డిన పిన్నెల్లి ramakrishna REDDY' target='_blank' title='రామ‌కృష్ణారెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">రామ‌కృష్ణారెడ్డి పై ఎన్నిక‌ల సంఘం క‌ఠిన‌ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నాను.

వైసీపీ ఫ్యాక్ష‌న్ పాలిటిక్స్‌కి జూన్ 4 న ప్ర‌జ‌లు అస‌లు సిస‌లు తీర్పు ఇవ్వ‌బోతున్నారు అని లోకేష్ పోస్ట్ చేశాడు. ఇక తాజాగా నారా లోకేష్ చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది. ramakrishna REDDY' target='_blank' title='పిన్నెల్లి రామకృష్ణారెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇప్పటికే మాచర్ల నుండి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎంపిక అయ్యారు. ఇకపోతే ఈ సారి కూటమి అభ్యర్థి అయినటువంటి జూలకంటి బ్రహ్మానంద రెడ్డి తో పోటీ పడబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: