ఏపీ: వైసీపీ పార్టీకి టిడిపి మంత్రులు మద్దతు ఇస్తారా..?

Divya
దేశవ్యాప్తంగా గత కొద్దిరోజుల నుంచి లోక్సభ ఎన్నికల హడావిడి చాలా కొనసాగుతూనే ఉంది. ఈసారి ఎన్నికలలో హ్యాట్రిక్  కొట్టాలని ఎన్డీఏ కూటమి భావిస్తూ ఉన్నది.. మరొకసారి బిజెపి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా దేశం చిన్న భిన్నం అవుతుందంటూ మరి కొంతమంది నేతలు ఆందోళన చెందుతున్నారు. ఈ సమయంలో ఒక ఆసక్తికరమైన చర్చ తెర మీదకి రావడం జరిగింది. దేశవ్యాప్తంగా 7 దశలలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో ఇప్పటికే ఐదు విడుదల పోలింగ్ కూడా పూర్తయింది.

అయితే ఈ ఓటింగ్ సరళి చూసి ఇండియా కూటమి కూడా అధికారంలోకి వస్తుందని నేతలు చాలా ధీమాతో ఉన్నారు. మరొక పక్క 400 సీట్లు కన్ఫామ్ అంటూ బిజెపి నేతలు కూడా చెబుతున్నారు. అయితే వాస్తవాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. బిజెపి ఎంత ప్రయత్నం చేసిన 200 సీట్లకు మించి వస్తాయని మిత్రపక్షలతో కలిస్తే మరో 50 వరకు వచ్చి ఆగిపోతాయని పలువురు నేతలు కూడా విశ్లేషకులు కూడా తెలియజేస్తున్నారు.. అంటే దాదాపుగా 272 మ్యాజిక్ ఫిగర్ ని అయితే  టచ్ చేయగలదని వినిపిస్తోంది.

అంతేకాకుండా కనీసం 20 నుంచి 25 ఎంపీల మద్దతు కచ్చితంగా కావాల్సింది అని అంతగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలోనే తాజాగా మూడు పార్టీల పేర్లు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి.. ముఖ్యంగా ఓడిసాలో బిజెడి.. తెలంగాణలో టిఆర్ఎస్.. ఏపీలో వైసీపీ మాత్రం కూటమికి చెందకుండా డైరెక్ట్ గా బరిలోకి దిగుతున్నాయి. ఇలాంటి సమయంలో బీజేడీకి కచ్చితంగా 10 సీట్లు వస్తాయని.. వీరు బిజెపికి సపోర్ట్ చేస్తే కాస్త సేఫ్ ఉంటుందని చెప్పవచ్చు.. టిఆర్ఎస్ విషయానికి వస్తే లోక్సభ ఎన్నికలలో వారి సీట్లు ఎన్ని వస్తాయని విషయం పైన చాలా బలమైన వార్తలు వినిపిస్తున్నాయి.. మరొక పక్క వైసిపి కూడా అధికారంలోకి వస్తే కనీసం .. నుంచి 15 తక్కువ కాకుండా ఎంపీ సీట్లు వస్తాయని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఎన్డీఏ అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా వైసిపి పార్టీ సపోర్టు ఉండాల్సిందే. కూటమి అధికారంలోకి రాకపోయినా కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. కూటమిలో భాగంగా టిడిపి పార్టీ బిజెపికి సపోర్ట్ చేసినప్పుడు వైసిపి మద్దతు ఇచ్చిన పార్టీలో టిడిపి ఎంపీలు కేంద్ర మంత్రులుగా కొనసాగితే అందుకు జగన్ అంగీకరిస్తారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. మరి ఇలాంటి విషయంలో జగన్ కు మద్దతుగా టిడిపి మంత్రులు అనుసరిస్తారా అనే విషయం కూడా వైరల్ గా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: