ఏపీ: నగరి నియోజకవర్గంలో రోజాపై తీవ్ర వ్యతిరేకత.. ఈసారి ఓడిపోయినట్టేనా..?

Suma Kallamadi
వైసీపీ నాయకురాలు, నగరి ఎమ్మెల్యే రోజా ఏపీ రాజకీయాల్లో ప్రముఖంగా నిలుస్తుంటారు. ఆమె ఈసారి కూడా శాసనసభ సభ్యురాలుగా పోటీ చేస్తున్నారు. గత రెండు ఎన్నికల్లో ఆర్ కే రోజా నగరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ గెలుపులను ఆమె స్వల్ప తేడాతోనే సాధించారు. ఈసారి ఆ స్వల్ప విజయం కూడా దక్కేలాగా కనిపించడం లేదు. ఎందుకంటే రోజా అవినీతికి తెర లేపారట, ఆమె భర్త, సోదరుడి పెత్తనాలు ఎక్కువ అయ్యాయని వైసీపీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. ఇప్పటికే చాలామంది టీడీపీలోకి వెళ్లిపోయారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. స్థానిక నేతల సపోర్టు లేకపోతే చాలామంది ఓటర్లను కోల్పోయే అవకాశం ఉంటుంది. ఆ కారణంగా ఈసారి రోజా ఓడిపోవడం ఖాయమనే అభిప్రాయాలు, అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. నగరి నియోజకవర్గ తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో ఉంటుంది.
సాధారణంగా ఇక్కడ ఎవరు గెలుస్తారు అనేది చివరి రౌండు ఓట్లు విప్పేదాకా తేలదు. అంటే చిన్న తేడా వచ్చినా రోజా ఓడిపోయే అవకాశం ఉంటుంది. ఈసారి రోజా కి పోటీగా టీడీపీ అభ్యర్థి గాలి భాను ప్రకాష్ రంగంలోకి దిగారు. పోలింగ్ తేదీకి సమయం దగ్గర పడుతున్న వేళ టీడీపీ కార్యకర్తల్లో ఉత్సాహం అనేది బాగా కనిపిస్తోంది. మరోవైపు వైసీపీ శ్రేణుల్లో బాధ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇక్కడి ప్రజలు వైసీపీ తమకు మంచి చేయలేదని భావనలో ఉన్నారు. ఇక రోజాపై ఉన్న అవినీతి ఆరోపణలు ప్రజలను మరింత దూరం చేశాయని అంటున్నారు.
ఈ నియోజకవర్గంలో 2,01,607 ఓట్లు ఉన్నాయి. వారిలో చాలామంది రోజాకి వ్యతిరేకంగానే ఉన్నారని సమాచారం. 2014లో రోజాపై గాలి ముద్దుకృష్ణమనాయుడు పోటీ చేసి కేవలం ఎనిమిది వందల ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2019లో వైసీపీ వేవ్ కారణంగా రోజా ప్రత్యర్థి గాలి భాను ప్రకాష్ పై సుమారు మూడు వేల ఓట్లతో గెలుపొందారు. ఈ విధంగా చూసుకుంటే రెండు ఎన్నికల్లో కూడా ఆమె చాలా స్వల్ప తేడాతో విజయం సాధించారు. రోజా ఎంపీ అయ్యాక సోదరులు కుమారస్వామి రెడ్డి, రామ ప్రసాద్ రెడ్డి, భర్త సెల్వమని పెత్తనాలు బాగా పెరిగిపోయాయట. మీరు ప్రతి పని కోసం కమిషన్లు లంచాలు పుచ్చుకుంటున్నారట. ఈ విషయాలను సొంత పార్టీ వాళ్లే బహిరంగంగా బయట పెడుతూ విమర్శిస్తున్నారు. ఈ ధోరణి వల్ల ఆ రోజాకి ఈసారి ఓటమి తప్పదు అని అంటున్నారు. మరి ఎవరు ఓడిపోతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: