RC16: వామ్మో ఆ ఒక్క సెట్ కోసం అన్ని కోట్లు ఖర్చు చేశారా..!?

Anilkumar
త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్  సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం అనౌన్స్ చేసినప్పటి నుండి సినిమాపై భారీ అంశాలు నెలకొన్నాయి. కానీ చివరికి ఏం జరుగుతుందో చూడాలి మరి . దీనికోసం  ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎదురుచూస్తున్నారు  మెగా అభిమానులు. ఇకపోతే గేమ్ చేంజర్ సినిమా చేస్తూనే మరొకవైపు

 బుచ్చిబాబు దర్శకత్వంలో తన నెక్స్ట్ సినిమా అనౌన్స్ చేశాడు రామ్ చరణ్. ఇందులో భాగంగానే ఇప్పుడు రామ్ చరణ్ చేస్తున్న గేమ్ చేంజర్ సినిమా చివరిదశకి చేరుకుంది. ఈనెల చివరాఖరి నుండి రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమా షూటింగ్ స్టార్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే రామ్ చరణ్ ఒకవైపు గేమ్ చేంజర్ సినిమా చేస్తూనే మరొకవైపు బుచ్చిబాబు సినిమా సెట్స్ లో కూడా కనిపిస్తున్నాడు. అంతేకాదు గత కొద్దిరోజులుగా డైరెక్టర్ ఈ సినిమాకి సంబంధించిన పనులతో బిజీగా ఉన్నాడు. ఇందులో భాగంగానే

 ఇప్పుడు తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతారు. అది ఏంటంటే.. దీని కోసం రంగస్థలం సినిమా తరహాలో భారీ విలేజ్ సెట్ ను ఏర్పాటు చేస్తున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. అంతేకాదు సినిమాకు సంబంధించిన 70% వరకు షూటింగ్ మొత్తం కూడా ఆ సెట్ లోనే జరిగే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఈ సెట్ కోసం మేకర్స్ ఖర్చు చేసిన బడ్జెట్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే ఈ సెట్ కోసం దాదాపుగా 25 నుండి 30 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లుగా సోషల్ మీడియా వేదికగా సమాచారం వినబడుతోంది. నాచురల్ గా ఉండాలి అంటే ఆ మాత్రం ఖర్చు చేయక తప్పదు మరి. అందుకే సినిమా విషయంలో ప్రొడ్యూసర్స్ ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వట్లేదు అని అంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: