ఆ తమిళ స్టార్ హీరో తో కూడా రొమాన్స్ కి రెడీ అయిన కియారా..!?

Anilkumar
తమిళ స్టార్ హీరో ధనుష్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.  కేవలం నటుడిగానే కాకుండా అనేక రంగాల్లో టాలెంట్ ఉన్న వ్యక్తి కేవలం నటుడిగా మాత్రమే కాకుండా గాయకుడిగా రచయితగా కథకుడుగా దర్శకుడుగా నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ ఉంటాడు. అలా అన్ని టాలెంట్స్ ఉన్న ఈ స్టార్ హీరో కేవలం తమిళంలోనే కాకుండా తెలుగు హిందీ భాషల్లో కూడా నటిస్తూ పాన్ ఇండియా స్థాయిలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే తాజాగా ఇప్పుడు ఆయన చేస్తున్న లేటెస్ట్ సినిమా రాయల్. ఇక ఈ

 సినిమా ఆయన స్వీయ దర్శకత్వంలో వస్తోంది. ఇందులో హీరోగా కూడా ఆయనే నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకునే త్వరలోనే సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లుగా సమాచారం వినబడుతుంది. కాగా ఇది ధనుష్ హీరోగా నటిస్తున్న 50వ సినిమా. అదే విధంగా తమిళంతో పాటు తెలుగులో కూడా కుబేర అనే సినిమాలో నటిస్తున్నాడు. త్వరలోనే సినిమా విడుదల కూడా కాబోతోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన షూటింగ్ జరుగుతోంది.

 అయితే ఇందులో టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. అలాగే రష్మిక మందన హీరోయిన్గా నటిస్తోంది.  ధనుష్ కేవలం తెలుగులోనే కాకుండా హిందీలో కూడా సినిమాలు చేశాడు. ఇంతకుముందు రంజనా శమితా అత్రాంగి వంటి హిందీ సినిమాల్లో నటించి బాలీవుడ్ లో కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే తాజాగా ఇప్పుడు మరొకసారి బాలీవుడ్ సినిమాలో నటించడానికి రెడీ అయినట్లుగా తెలుస్తోంది. ఇక ఆ సినిమా ప్రముఖ దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో తెరకెక్క బోతున్నట్లుగా వినికిడి. అంతేకాదు అక్టోబర్ లేద నవంబర్లో సినిమాకి సంబంధించిన పనులు స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లుగా చెబుతున్నారు. అయితే ఇందులో హీరోయిన్ ఎవరు అన్న విషయం ఇప్పుడు సర్వత్ర ఆసక్తిగా మారింది.  తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇందులో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రాకపోయినప్పటి కీ ఇదే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: