ఎగ్జిట్ పోల్స్ పై రోజా రియాక్షన్.. ఎంత మాట?

Purushottham Vinay
ఇక మరికొన్ని గంటల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రానున్నాయి. గత నెల 13న జరిగిన హోరా హో రీ ఎన్నికల సమరంలో ఎవరు గెలుస్తున్నారు? ఎవరు ఓడుతున్నారనే విషయాలపై అందరిలో కూడా నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది.ఇలాంటి సమయంలోనే దాదాపు 40కిపైగా సర్వే సంస్థలు ఎవరు గెలుస్తారనే విషయాలపై తమ అంచనాలు విడుదల చేశాయి. వీటిలో కొన్ని టీడీపీ కూటమికి అనుకూలంగా ఉంటే మరికొన్ని మాత్రం వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి.అయితే.. టీడీపీకి అనుకూలంగా ఉన్న వాటిలో ప్రతిష్టాత్మక ఇండియా టుడే ఇంకా మై యాక్సస్ వంటివి కూడా ఉన్నాయి. దీంతో ఈ ఎగ్జిట్ పోల్స్ పై చాలా చర్చలు సాగుతున్నాయి. మరీ ముఖ్యంగా జాతీయస్థాయిలో జరిగిన సర్వేల్లో ఏపీలో వైసీపీకి పార్లమెంటు స్థానాలు చాలా చాలా తక్కువగా ఇవ్వడం జరిగింది. అయితే ఈ పరిణామాలపై రాజకీయంగా నాయకులు మాటల తూటాలు పేలుస్తున్నారు.


ఈ ఎగ్జిట్ పోల్స్‌ను ఉద్దేశ పూర్వకంగా చేయించుకున్నారని.. ఎన్డీయే కేంద్రంలో ఉంది కాబట్టి.. దానికి అనుకూలంగా ఇచ్చారని ఇలా చాలా రకాల విశ్లేషణలు కూడా వస్తున్నాయి.ఇక, ఈ వ్యవహారంపై వైసీపీ నాయకురాలు.. వైసీపీ మంత్రి రోజా స్పందించారు. టీడీపీకి అనుకూలంగా ఉన్న ఎగ్జిట్ పోల్స్‌పై స్పందిస్తూ.. వాటిని వండి వార్చిన సర్వేలుగా ఆమె పేర్కొన్నారు.. కూటమికి ఉద్దేశ పూర్వకంగానే వీటిని తీసుకువచ్చారని, గ్రౌండ్ లెవిల్ రియాలిటీని పసిగట్టలేదని రోజా చెప్పారు. వారి వారి సొంత కథనాలను సర్వేల రూపంలో తీసుకువచ్చారు. వీటిలో రియాలిటీ లేదని రోజా చెప్పారు.. ఇంకా అంతేకాదు నిజం ఏంటో జూన్ 4న తేలిపోతుందని అన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి అవుతారని ఆమె ధీమా వ్యక్తం చేశారు.ఇతర సంస్థలు ఎలా ఉన్నా కానీ కొంత విశ్వసనీయ సర్వేగా పేరున్న ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్స్ మాత్రం వైసీపీకి అనుకూలంగా వచ్చాయి. 94 నుంచి 104 స్థానాల్లో వైసీపీ విజయం దక్కించుకుంటుందని ఈ సర్వే తేల్చి చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: